* తల్లిపాలే బిడ్డకు శ్రేష్టం: ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ మల్లీశ్వరి
* ముర్రు పాలలో రోగనిరోధక శక్తి ఉంటుంది: డాక్టర్ లలిత, జిల్లా వైద్య విధాన పరిషత్తు కోఆర్డినేటర్.
* తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానం: డాక్టర్ పద్మజ, ప్రభుత్వాసుపత్రి గైనకాలజీ విభాగాధిపతి.
* బిడ్డ పుట్టిన గంట లోపు తల్లిపాలు తాపించాలి: డాక్టర్ అరుణ జ్యోతి, ప్రభుత్వాసుపత్రి చిన్నపిల్లల విభాగాధిపతి.
* తల్లిపాల విశిష్టతపై కరపత్రాలు ఆవిష్కరణ
* నెరవాటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సౌజన్యంతో బ్రెడ్లు, పండ్లు పంపిణ
నంద్యాల : స్థానిక పట్టణంలోని లయన్స్ క్లబ్,ఐఎంఏ నంద్యాల మిషన్ పింక్ హెల్త్ విభాగం సంయుక్త నిర్వహణలో ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి తల్లీ బిడ్డల ప్రత్యేక విభాగంలో మంగళ వారం తల్లి పాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ అధ్యక్షతన,నెరవాటి ఆసుపత్రి నిర్వాహకులు, నంద్యాల ఐఎంఏ మిషన్ పింక్ హెల్త్ అధ్యక్షురాలు డాక్టర్ నెరవాటి అరుణ కుమారి సౌజన్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరంటెండెంట్ డాక్టర్ మల్లీశ్వరి,జిల్లా వైద్య విధాన పరిషత్ కోఆర్డినేటర్ డాక్టర్ లలిత,నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు,ఆసుపత్రి స్త్రీ,ప్రసూతి విభాగ అధిపతి డాక్టర్ పద్మజ, చిన్న పిల్లల విభాగాధిపతి డాక్టర్ అరుణ జ్యోతి, నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు పాల్గొని తల్లిపాల విశిష్టతపై రూపొందించిన కరపత్రాలు ఆవిష్కరించారు.తల్లిపాల విశిష్టత పై డాక్టర్ మల్లీశ్వరి, డాక్టర్ లలిత,డాక్టర్ నెరవాటి అరుణ కుమారి,డాక్టర్ పద్మజ ,డాక్టర్ అరుణ జ్యోతి, డాక్టర్ వసుధ, డాక్టర్ నర్మద, డాక్టర్ లక్ష్మీ సౌజన్య,గర్భవతులకు,చంటి బిడ్డల తల్లులకు తల్లిపాల విశిష్టతపై అవగాహన కల్పించారు. ప్రసవించిన వెంటనే వచ్చే ముర్రుపాలలో బిడ్డలకు మంచి రోగ నిరోధక శక్తి కలిగి ఉంటుందని అన్నారు. ముర్రుపాలు తప్పనిసరిగా తాపించాలని అన్నారు. బిడ్డలకు పాలిచ్చిన తల్లులకు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందన్నారు. ఆరోగ్యవంతమైన శిశువు ఎదుగుదలకు తల్లిపాలను మించిన మరొక ఆహారం సృష్టిలో ఏదీ లేదన్నారు.చంటి బిడ్డ తల్లులకు, గర్భవతులకు, ఆసుపత్రి వార్డులో ఉన్న బాలింతలకు 200 మందికి బ్రెడ్, పండ్లు నెరవాటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి డాక్టర్ వినోద్ కుమార్, డాక్టర్ అరుణకుమారి సౌజన్యంతో పంపిణీ చేశారు.లయన్స్ క్లబ్ తరఫున డాక్టర్ మల్లీశ్వరి, డాక్టర్ లలిత, డాక్టర్ పద్మజ,డాక్టర్ అరుణ జ్యోతి, డాక్టర్ అరుణ కుమారి లను శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ మధుసూదన రావు, డాక్టర్ సహదేవుడు,ప్రభుత్వ ఆసుపత్రి గైనకాలజీ విభాగాధిపతి డాక్టర్ పద్మజ, చిన్నపిల్లల విభాగ అధిపతి డాక్టర్ అరుణ జ్యోతి, నెరవాటి ఆసుపత్రి నిర్వాహకురాలు డాక్టర్ అరుణకుమారి, నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు , కార్యదర్శి తాతిరెడ్డి భాస్కర రెడ్డి, కోశాధికారి అమిదేల జనార్ధన్, లయన్స్ క్లబ్ సభ్యులు కసెట్టి చంద్రశేఖర్, బాబురావు, చంద్రమోహన్, మామిళ్ల నాగరాజు, రామయ్య తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply