* కే.ఎన్.ఎం. పురపాలక పాఠశాలకు క్రీడా పరికరాల పంపిణీ
* లయన్స్ క్లబ్ యూత్ బ్యాచ్ సౌజన్యంతో
* విద్యార్థులను చదువుతోపాటు క్రీడలలో ప్రోత్సహించాలి: డాక్టర్ రవి కృష్ణ
నంద్యాల : స్థానిక పట్టణంలోని కేఎన్ఎం పురపాలక పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శుక్రవారం హాకీ మాంత్రికుడు పద్మభూషణ్ ధ్యాన్ చంద్ జన్మదినోత్సవం సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహించారు. ముందుగా ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, ఉమ్మడి కర్నూలు జిల్లా మాజీ ఒలింపిక్ చైర్మన్ డాక్టర్ రవి కృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను చదువుతోపాటు క్రీడలలో కూడా ప్రోత్సహించాలని పాఠశాల యాజమాన్యాలను తల్లిదండ్రులను కోరారు. క్రీడల ద్వారా శారీరక దారుఢ్యం, మానసిక వికాసం కలుగుతుందని, ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుందని అన్నారు. ధ్యాన్ చంద్ జీవిత విశేషాలు వివరించారు. ఈ సందర్భంగా నంద్యాల లయన్స్ క్లబ్ యూత్ బ్యాచ్ సౌజన్యంతో 15 వేల రూపాయల విలువ చేసే క్రీడా పరికరాలు పాఠశాలకు అందించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అసదుల్లా, జోన్ చైర్మన్ నిజాముద్దీన్, సీనియర్ సభ్యులు భవనాసి నాగ మహేష్, లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు కూర ప్రసాద్, పోసిన సుబ్బారావు, కోశాధికారి అమిదేల జనార్ధన్,సుజిత్, రాజ్ పవన్, పాఠశాల అధ్యాపక బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply