మన మానసిక స్థితి (సైకలాజికల్)

*  సంబంధ గుణాత్మకత ఎంత ఆరోగ్యంగా ఉంది?  

 *     మీరు బాగున్నారా?

         వ్యక్తిగత అన్వేషణ : ఇప్పటి సమాజంలో మనసుకు సంబంధించిన ప్రశ్నలు అడగడం ఒక శక్తివంతమైన మొదటిపదంగా మారుతోంది. “మీరు బాగున్నారా?” అనే ప్రశ్న, సాదాసీదాగా అనిపించినా, దానికి తగిన సమాధానం మనం మనలోనే చాలా లోతుగా వెతకాలి. ప్రత్యేకంగా, మన సంబంధాల (రిలేషన్షిప్) విషయంలో ఈ ప్రశ్న మరింత ప్రాముఖ్యత కలిగి ఉంటుంది” నా బంధం (రిలేషన్షిప్) మానసికం (సైకలాజికల్)గా ఆరోగ్యంగా ఉందా?”

సంబంధ ఆరోగ్యాన్ని కొలిచే సూక్ష్మ అర్ధాలు :

ఒక బంధం ఆరోగ్యంగా ఉందా అని తెలుసుకోవాలంటే కొన్ని ముఖ్యాంశాలను మనం గమనించాలి

1. కమ్యూనికేషన్ : మీ ఇద్దరి మధ్య నిజాయితీతో మాట్లాడే స్వేచ్ఛ ఉందా? మీరు మీ భావాలను, బాధలను నిశ్చింతగా పంచుకోగలుగుతున్నారా?

2. గౌరవం మరియు విశ్వాసం : ఒకరినొకరు గౌరవించడం, నమ్మకం కలిగించడం ఆరోగ్యకరమైన సంబంధానికి పునాది. ఏదైనా చిన్న అనుమానం లేదా అవమానం సంబంధాన్ని బలహీనంగా మారుస్తుంది.

3. స్వేచ్ఛ మరియు వ్యక్తిత్వం : సంబంధం మీ వ్యక్తిత్వాన్ని నిరోధించేలా ఉందా? లేకా మీరు మీ స్వభావంతో జీవించే అవకాశం పొందుతున్నారా?

4. ఓపిక మరియు అర్థం చేసుకునే తత్వం : ఒకరి లోపాలను గుర్తించి, తగిన రీతిలో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. విభేదాల సందర్భంలో పరస్పరం నిందించుకోవడం కన్నా పరిష్కారానికి రావడమే ఆరోగ్య సూచిక.

మీరు బాగున్నారా?  మీ మనసులో నిగ్రహించుకున్న భావాలు, మీరు అనుభవించే సంతోషం లేదా ఒత్తిడి, మీ మానసిక ఆరోగ్యానికి ప్రతిరూపం.

మీరు మిమ్మలనికొన్ని ప్రశ్నలు వేసుకోవచ్చు :

1. నేను ఈ బంధంలో సంతోషంగా ఉన్నానా?

2. నాకు మద్దతుగా ఉండే వ్యక్తి నా జీవితంలో ఉన్నాడా?

3. నా ఆత్మవిశ్వాసం ఈ బంధంతో పెరుగుతోందా లేక తగ్గుతోందా

సానుకూల మార్గాలు : ఒక సంబంధాన్ని మెరుగుపరచడానికి ఎప్పుడూ ఆలస్యం చేసుకోవద్దు. పరస్పర సంభాషణ, అవగాహన పెంపొందించడం, అవసరమైతే బాహ్య మద్దతు (థెరపీ, కౌన్సిలింగ్) తీసుకోవడం ఎంతో ఉపయుక్తం.

సారాంశం : “మీరు బాగున్నారా?” అనే ప్రశ్నను మనం తరచూ ఇతరులను అడుగుతాం. కానీ మనమే మన మనస్సును అడగడం కొంత అరుదు. ఈ రోజు నీవు నీకు స్వయంగా వేసుకోవలసిన ప్రశ్న? నా బంధం నాకు మానసిక ప్రశాంతత ఇస్తోందా? నేను నిజంగా బాగున్నానా?

మానవ సంబంధాలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రేమ, గౌరవం, నమ్మకం, మరియు కమ్యూనికేషన్ అనేవి నాలుగు మూలస్థంభాలు. అవి బలంగా ఉన్నపుడే మనం నిజంగా బాగుంటాము.

డా. శివ బాలిరెడ్డి కాటసాని

ఎం.పి.టి,పి.హెచ్.డి (సైకాలజీ)

కన్సల్టెంట్ ఫిజియో & సైకాలజిస్ట్

అసిస్టెంట్ ప్రొఫెసర్

సంస్కృతి యునివర్సిటీ (మథుర)

ప్రైమ్ న్యూరో రిహాబిలిటేషన్ సెంటర్

నంద్యాల, ఫోన్ : 9697969758

Share this