న్యూఢిల్లీ : వర్షాకాల పార్లమెంటు సమావేశాలు తొలిరోజే గందరగోళంగా సాగాయి. ‘ఆపరేషన్ సిందూర్’, ఎయిరిండియా విమాన ప్రమాదం అంశాలపై ప్రతిపక్షాలు ప్రధానమంత్రి మోదీ స్పందించాలని డిమాండ్ చేశాయి. కాంగ్రెస్, డీఎంకే, టీఎంసీ, ఎస్పీ, వామపక్ష పార్టీలు, ఎన్‌సిపి తదితర ఇండియా బ్లాక్ ఎంపీలు ప్రధాని మాట్లాడాల్సిందేనని స్పీకర్ ఒం బిర్లా వద్ద పట్టు పట్టారు. ఉదయం ప్రారంభమైన లోక్‌సభ మధ్యాహ్నం 2 వరకు వాయిదా పడింది. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా ప్రతిపక్షాల నిరసన కొనసాగడంతో మళ్లీ సాయంత్రం 4 గంటలకు వాయిదా పడింది. చివరకు సభ మంగళవారానికి వాయిదా వేసారు.రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ ప్రభుత్వం ఏ అంశమైనా చర్చించడానికి సిద్ధమని చెప్పారు. పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ మధ్యాహ్నం బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో చర్చకు సిద్ధంగా ఉన్నప్పటికీ సభలో నిరసనలు సరికాదని వ్యాఖ్యానించారు.
కానీ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
Leave a Reply