తిరుపతి : స్థానిక నగరంలోని పలు ప్రాంతాల్లో ఇండ్లు, దుకాణాల ముందు డ్రెయినేజీ కాలువలపై నిర్మించిన ర్యాంపులు, మెట్లు తొలగించి కాలువలు శుభ్రం చేయించాలని కమిషనర్ ఎన్.మౌర్య అధికారులను ఆదేశించారు. ప్రజా పిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుండి వచ్చిన వినతుల మేరకు 32, 36 వార్డుల్లో కే.కె.లేఔట్, దొడ్డాపురం స్ట్రీట్, గిరిధర్ దాస్ లేన్, యాదవ వీధి, నిమ్మకాయల వీధి తదితర ప్రాంతాల్లో కార్పొరేటర్లు కుడితి సుబ్రమణ్యం, శైలజ, అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పలువురు కాలువలపై మెట్లు, ర్యాంపులు కట్టడంతో మురుగు నీరు వెళ్ళడం లేదని, చెత్తకుప్పలు తొలగించడం లేదనే పిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయని అన్నారు. పట్టణ ప్రణాళిక విభాగం, ఆరోగ్య శాఖ విభాగం అధికారులు సమన్వయం చేసుకుని ర్యాంపులు, మెట్లు తొలగించి శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. యాదవ వీధిలో నూతనంగా నిర్మిస్తున్న డ్రైనేజీ కాలువ పనులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు. కేజెక్స్ స్కూల్ సందులో చెత్త కుప్పలు ఉండడంతో సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేసి వెంటనే శుభ్రం చేయాలని అన్నారు. అలాగే ప్రజల నుండి వచ్చిన వినతుల ఆయా విభాగాల అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని అన్నారు. కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజినీర్ తులసి కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డి.ఈ.రాజు ఏసిపి మధు, శానిటరీ సూపర్ వైజర్ చెంచయ్య, తదితరులు ఉన్నారు.
డ్రైనేజీ కాలువలపై ఉన్న ర్యాంపులు తొలగించి శుభ్రం చేయండి : కమిషనర్ ఎన్.మౌర్య

Leave a Reply