విద్యార్థుల్లో క్రమశిక్షణ పెంచేందుకు బాధ్యత తీసుకోవాలి- ఎస్సై నాగార్జున రెడ్డి

గడివేముల  : విద్యార్థుల్లో క్రమశిక్షణతో పాటు బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు  కూడా బాధ్యత తీసుకోవాలని గడివేముల ఎస్సై నాగార్జున రెడ్డి అన్నారు. బుధవారం ఆయన స్థానిక శ్రీ రాజరాజేశ్వరి పాఠశాలలో యాంటీ ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, మాదక ద్రవ్యాల  వలన కలిగే నష్టాలు, సోషల్ మీడియా, రోడ్డు భద్రత, సైబర్ నేరాలపట్ల విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతిగా సెల్ ఫోన్ వినియోగం సామాజిక మాధ్యమాలైన ఫేస్ బుక్, వాట్సప్, ఇన్స్టాగ్రామ్ లాంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అవసర లింకులు షేర్ చేయకూడదు అన్నారు. తెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్, బెట్టింగ్ యాప్స్ లాంటి వాటితో మోసపోకూడదు అన్నారు. ఈవ్ టీజింగ్, ర్యాగింగ్ అనేవి నేరమని ఎవరైనా తోటి విద్యార్థులపై ర్యాగింగ్ కు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని భవిష్యత్తు కోల్పోతారని విద్యార్థులకు తెలియజేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. పిల్లల నడవడిక తల్లిదండ్రులు కూడా గమనించాలి అన్నారు. మాదక ద్రవ్యల బారినపడి జీవితాలను నాశనం చేసుకోవద్దని విద్యార్థులకు సూచించారు. సమస్యలు ఎదురైనప్పుడు యువత ధైర్యంతో ఎదుర్కోవాలి తప్ప ఆత్మహత్య అనేది సమస్యలకు పరిష్కారం కాదన్నారు. విద్యార్థుల దృష్టి తమ అనుకున్న లక్ష్యం మీద మాత్రమే ఉండాలని, చెడుపట్ల ఆకర్షితులు కావద్దని విద్యార్థులకు సూచించారు. బాధ్యత యుతమైన పౌరులుగా ఉండి కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలు చేరుకునే విధంగా ప్రతి విద్యార్థి లక్ష్యంగా తీసుకోవాలన్నారు.

Share this