విశాఖలో ఆర్ టి సి బస్సు దగ్ధం

* ఘటన స్థలానికి వెంటనే చేరుకొని పరిశీలించిన రాష్ట్ర రవాణా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

* తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశాలు

విశాఖపట్నం : స్థానిక నగరంలోని ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ఆర్ టి సి  బస్సు దగ్ధమైంది. కూర్మన్నపాలెం నుంచి విజయనగరం వెళ్తున్న బస్సులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ బస్సును నిలిపివేసి ప్రయాణికులను సురక్షితంగా దింపడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రమాద సమాచారం తెలుసుకున్న రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి  వెంటనే ఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. అధికారులు, పోలీసుల నుంచి వివరాలు సేకరించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Share this