ఆర్యవైశ్యుల పై దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేదు :రాష్ట్ర మంత్రి ఎన్ యం డి ఫరూక్

* ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవు

నంద్యాల : స్థానిక పట్టణంలోని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో రాష్ట్ర మంత్రి ఎన్ యం డి ఫరూక్ మాట్లాడుతూ వ్యక్తిగత స్థల వివాదంలో ఆర్యవైశ్యుల పై కొందరు దాడికి పాల్పడినట్టు ఇటీవల తన దృష్టికి రావడంతో బాధిత కుటుంబ సభ్యులను కలిసి మాట్లాడి వారికీ అండగా ఉంటామని తెలియజేశారు. ఆర్యవైశ్య సోదరులు తమ కుటుంబానికి ఎంతో ఆప్తులు, వారిని తమ కుటుంబ సభ్యులుగా భావిస్తామని తెలియజేశారు.భౌతిక దాడులకు పాల్పడిన వారు ఎవరైనా సరే ఉపేక్షించబోమని  అవసరమైతే పీడీ యాక్ట్ నమోదు చేసి  కఠినచర్యలుతీసుకుంటామని  శాంతియుతమైన నంద్యాల ప్రాంతాన్ని విఘతం కల్పిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని ఎన్ యం డి ఫరూక్   హెచ్చరించారు.

Share this