* నెరవాటి పాలి క్లినిక్, నంద్యాల లయన్స్ క్లబ్ సంయుక్త నిర్వహణ
* శిబిరం ప్రారంభించిన ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ
* నెరవాటి పాలి క్లినిక్ లో ప్రతి గురువారం ఉచిత ఓ.పి.డి సేవలు: ప్రకటించిన డాక్టర్ నెరవాటి వినోద్.
* వైద్య సేవలు అందించిన డాక్టర్ సుమన్,డాక్టర్ ఫాతిమా, డాక్టర్ దివ్య తేజ, డాక్టర్ నటరాజ్, డాక్టర్ పద్మ ప్రియాంక
* 300 మంది రోగులను పరీక్షించి ఉచిత మందుల పంపిణీ
* దాదాపు 150 మందికి ఉచితంగా బోన్ డెన్సిటీ ఎముకల సాంద్రత పరీక్షల నిర్వహించారు
నంద్యాల : స్థానిక పట్టణంలోని గాంధీ చౌక్ సమీపంలోని పెద్ద పోస్ట్ కార్యాలయం ఎదురుగా ఉన్న నెరవాటి పాలి క్లినిక్, నంద్యాల లయన్స్ క్లబ్ సంయుక్త నిర్వహణలో పాలీ క్లినిక్ నిర్వాహకులు డాక్టర్ నెరవాటి వినోద్ కుమార్, డాక్టర్ అరుణకుమారి పర్యవేక్షణలో ఆదివారం ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశుల నాగరాజు అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ నెరవాటి పాలీ క్లినిక్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఉచిత వైద్య శిబిరాలు పేదలకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. నంద్యాల వైద్యులు సేవా దృక్పథంతో వివిధ సందర్భాలలో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. అలాగే డాక్టర్ నెరవాటి వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రతి గురువారం నెరవాటి పాలి క్లినిక్ లో ఓపి సేవలు ఉచితంగా అందిస్తామని ప్రకటించారు.
ఉచిత వైద్య శిబిరంలో ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ సుమన్, స్త్రీవ్యాధి, ప్రసూతి నిపుణురాలు డాక్టర్ ఫాతిమా, చిన్నపిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్ దివ్య తేజ, జనరల్ ఫిజీషియన్ డాక్టర్ నటరాజ్ ,దంత వైద్యురాలు డాక్టర్ పద్మ ప్రియాంక దాదాపు 300 మంది రోగులను పరీక్షించి, అవసరమైన పరీక్షలు నిర్వహించి, 50 వేల రూపాయల విలువచేసే మందులను ఉచితంగా పంపిణీ చేశారు. దాదాపు 150 మందికి ఎముకల సాంద్రత పరీక్షలు కూడా నిర్వహించారు.ఈ సందర్భంగా నంద్యాల లయన్స్ క్లబ్ తరపున అధ్యక్షులు సోమేసుల నాగరాజు, కార్యదర్శి తాతిరెడ్డి భాస్కర్ రెడ్డి ,కోశాధికారి అమిదేల జనార్ధన్ శిబిరంలో ఉచిత సేవలు అందించిన వైద్యులను శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు నెరవాటి సత్యనారాయణ, రమేష్, హరిబాబు, నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, కార్యదర్శి తాతిరెడ్డి భాస్కర్ రెడ్డి ,కోశాధికారి అమిదేల జనార్ధన్ , వైద్య శిబిరంలో సేవలందించిన వైద్యులు సుమన్, ఫాతిమా, నటరాజ్ ,దివ్య తేజ ,పద్మా ప్రియాంక పాల్గొన్నారు.
Leave a Reply