క్రెడాయ్ ప్రాపర్టీ షోను సద్వినియోగం చేసుకోండి

తిరుపతి : క్రెడాయ్ ప్రాపర్టీ షో 2025 ను సద్వినియోగం చేసుకోవాలని క్రెడాయ్ చైర్మెన్ గోఫినాధ్, ప్రెసిడెంట్ రామప్రసాద్ తెలిపారు. తిరుపతిలో గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ తిరుపతిలో క్రెడాయ్ ఆధ్వర్యంలో జరగబోయే ప్రాపర్టీ షో సెప్టెంబర్ 5, 6, 7 (2025) తేదీలలో డిబిఆర్ హాస్పిటల్ రోడ్డులోని శ్రీ కన్వెన్షన్ హాల్ నందు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తిరుపతి ప్రజలు, పరిసర ప్రాంతాలవారు అందరూ హాజరై ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసారు. ఈ ప్రాపర్టీ షో లో ఓపెన్ ప్లాట్స్, అపార్ట్ మెంట్స్, విల్లాస్, స్టీల్, సిమెంట్, బిల్డింగ్ మెటీరియల్స్, ఫర్నిచర్, ఫెయింటిగ్స్, హోమ్ లోన్లకు సంబంధించిన ప్రముఖ బ్యాంకులు ఇండియన్ బ్యాంక్, ఎస్.బి.ఐ, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓవర్సీస్ బ్యాంక్ పాల్గొంటాయని వివరించారు. ఆటో మొబైల్స్, ఇతర కంపెనీలు, అనేక స్టాల్స్ లో పాల్గొననున్నాయని తెలిపారు. ప్రజలు ఇక్కడ తుడా అప్రూవలతో అన్ని అనుమతులు కలిగిన క్లియర్ టైటిల్ ప్రోపర్టీస్ ను ను చూడవచ్చు, కొనుగోలు చేయవచ్చునని, ఇల్లు లేదా ప్రాపర్టీ కొనుగోలు చేయదలచిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని క్రెడాయ్ చైర్మెన్ గోఫినాధ్, ప్రెసిడెంట్ రామప్రసాద్ విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ బాబు, సెక్రటరీ నరసింహ రెడ్డి, ట్రెజరర్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.