రాష్ట్రస్థాయి అంధుల చెస్ పోటీలను ప్రారంభించిన టిడిపి పార్టీ నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్

*  అంధులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలి: డాక్టర్ జి. రామకృష్ణారెడ్డి

*  అంధుల చెస్ పోటీలు నంద్యాలలో నిర్వహించడం మొదటిసారి: డాక్టర్ రవి కృష్ణ

  * భోజన వసతి కల్పించి, క్రీడా దుస్తులు అందజేసిన భవనాసి నాగ మహేష్

నంద్యాల : లూయీ బ్రెయిలీ అంధుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో  జీవనజ్యోతి అంధుల వసతి గృహం ప్రాంగణంలో  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర స్థాయి అంధుల చెస్ పోటీలు శనివారం పోలూరు రోడ్డులో ఉన్న జీవనజ్యోతి  అంధుల సంక్షేమ వసతి గృహంలో ప్రారంభమయ్యాయి.

  ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ ఫర్ బ్లైండ్  అనుబంధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో రెండవ రాష్ట్రస్థాయి అంధుల చెస్ పోటీలు శని ఆది వారాలలో నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ఎండి ఫిరోజ్, రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలు లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగాడాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ అంధులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలని, క్రీడలలో కూడా రానించి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని కోరారు. అలాగే ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ 3000 వేల నుండి 6000 వేల వరకు చేసిందని గుర్తు చేశారు. క్రీడల్లో కూడా దివ్యాంగులను ప్రోత్సహించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నూతన క్రీడా పాలసీ లో దివ్యాంగ క్రీడలకు ప్రత్యేక ప్రణాళిక ప్రకటించారని తెలిపారు. అలాగే  డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ క్రీడాకోటాలో దివ్యాంగులకు కూడా అవకాశం కల్పిస్తూ కొత్తగా ఉత్తర్వులు జారీ చేశారని దివ్యాంగుల క్రీడాకారులకు ప్రోత్సాహామిస్తూ నిర్ణయం తీసుకున్న చంద్రబాబు నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. అంధుల రాష్ట్రస్థాయి చెస్ పోటీలలో వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారని, పదిమంది అంతర్జాతీయ స్థాయిలో పాల్గొన్న వారు కూడా ఉన్నారన్నారు .పోటీలలో విద్యార్థులకు షీల్డ్లు నగదు బహుమతులు డాక్టర్ రామకృష్ణారెడ్డి, భోజన వసతి క్రీడా దుస్తులు భవనాసి జ్యువెలర్స్ తరఫున భవనాసి నాగ మహేష్ సౌజన్యంతో అందించారు.తదుపరి ఫిరోజ్ రామకృష్ణారెడ్డి చదరంగం బోర్డుపై పావులు కదిలించి పోటీలను ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో ఎన్. సి . సి కల్నల్ ఫిలిప్, తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు ఖలీల్, జీవనజ్యోతి పాఠశాల నిర్వాహకుడు వలి భాష,భవనాసి నాగ మహేష్, యాతం చంద్రమౌళీశ్వర రెడ్డి, జోజి రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, క్రీడాకారులు పాల్గొన్నారు.

Share this