శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి పారువేట ఉత్సవ శోభాయాత్రకు టిడిపి పార్టీ రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ కు ఆహ్వానం

నంద్యాల  : మన ఊరు – మన గుడి – మన బాధ్యత సంస్థ మరియు ఇంటాక్ ప్రతినిధులు బాబురావు, శేఖర్ నంద్యాలలోని టిడిపి కార్యాలయంలో టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ ని మర్యాదపూర్వకంగా కలిసి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి పారువేట ఉత్సవ శోభాయాత్రకు రావాల్సిందిగా ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 26 వ తేది (శుక్రవారం) ఉదయం 9:00 గంటలకు ఆత్మకూరు బస్టాండ్ సమీపంలోని శ్రీ లక్ష్మీగణపతి ఆలయం నుండి ఈ శోభాయాత్ర ప్రారంభమవుతుందని తెలిపారు.సంప్రదాయబద్ధంగా జరిగే ఈ ఉత్సవంలో చెంచులు విల్లు, బాణాలతో స్వామివారి పల్లకీని స్పృశించే అద్భుత ఘట్టం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని వివరించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో నంద్యాల మూలమట్టం చైర్మన్ పసుపులేటి నారాయణ, నంద్యాల మార్కెట్ యార్డ్ డైరెక్టర్ స్వామి నాయక్, తోటరామయ్య, పుండరీకాక్ష రెడ్డి ,సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.