కర్నూలు : ప్రస్తుతం మారుతున్న సమాజంతో పాటు విద్యార్థులకు సాంకేతిక నైపుణ్యాలతో పాటు, నైతిక విలువలు పెంచేవిధంగా విద్య బోధన జరుగాలని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వహీద్ హుస్సేన్ సూచించారు. శనివారం కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎన్ ఆర్ పేటలో కొత్తగా ప్రారంభించిన షాహిన్ స్కూల్ ను ఆయన సందర్శించారు. షాహిన్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ సొసైటీ కరెస్పాండంట్ అబ్దుల్ హాజీ సాహెబ్, ప్రిన్సిపాల్ జాని ఆహ్వానం మేరకు పాఠశాలను సందర్శించారు.ఈ సందర్బంగా టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వహీద్ హుస్సేన్ మాట్లాడుతూ షాహిన్ స్కూల్ లో ముస్లింలతో పాటు ముస్లిమేతరులకు కూడా తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను అందించడం అభినందనీయం అన్నారు. చిన్నారుల్లో బాల్యము నుంచే మానవతావాదం, దేశం పట్ల బాధ్యత, సమాజం పట్ల స్పష్టత, సమానత్వం, దైవభీతి వంటి నైతిక విలువలను పిల్లలలో బోధించే విధంగా పాటశాలలో విద్యా విధానాన్ని అమలు చెయ్యడం పట్ల టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వహీద్ హుస్సేన్ పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో షాహిన్ విద్యా సంస్థల యాజమాన్యం వహీద్ హుస్సేన్ ను శాలువాతో ఘనంగా సత్కరించారు.
విద్యార్థులకు నైతిక విలువలు బోధించండి : టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వహీద్ హుస్సేన్

Leave a Reply