శ్రీ మద్దులేటి నరసింహస్వామి క్షేత్రంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతం

నంద్యాల జిల్లా/బేతంచెర్ల : మండలపరిధిలోని ఆర్.ఎస్. రంగాపురం గ్రామ శివారులో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ మద్దులేటి నరసింహస్వామి వారి దేవస్థానం  నందు 8వ తేది శ్రావణ శుక్రవారం  ఉదయం 10:00గంటలకు దేవస్థానం వారిచే ఆలయ వేదపండితులు, అర్చకుల ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మి వ్రతం నిర్వహించబడునని ఆలయ కార్యనిర్వహణాధికారి మరియు ఉప కమిషనర్ తెలిపారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ  సామూహిక వరలక్ష్మి వ్రతంలో పాల్గొను ముత్తైదువులు 1 ప్లేటు, 1చెంబు, 2గ్లాసులు తమవెంట తెచ్చుకావాలన్నారు. పూజకు అవసరమైన ఇతర సామగ్రి పసుపు, కుంకుమ, కొబ్బరికాయ, రవిక ఇతరములు దేవస్థానం వారిచేఉచితముగా అందాజేస్తామన్నారు.సామూహిక వరలక్ష్మి వ్రతంలో పాల్గొను ముత్తైదువుల కొరకుఆర్.యస్.రంగాపురం గ్రామంనుండి దేవస్థానమునకు వరకు ఉచిత ఆటో సౌకర్యంకలదు. సామూహిక వరలక్ష్మి వ్రతం అనంతరం మ.01:00 గం. కు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడును అని తెలిపారు.

Share this