నందికొట్కూరు : నందికొట్కూరు నియోజకవర్గం 10 బొల్లవరం గ్రామంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి గణేష్ విగ్రహాల వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని పొందిన మార్కెట్ యార్డ్ చైర్మన్ వీరం ప్రసాద్ రెడ్డి స్వామి వారి ఆశీస్సులు పొందారు. గణపయ్య ఆశీస్సులు అందరిపై ఉండాలని అన్నారు.అనంతరం స్వామివారి ఆశీస్సులు, తీర్థప్రసాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐక్యత భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో వినాయక చవితి వేడుకలను జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖశాంతులను అందించాలని విఘ్నేశుడిని ఆకాంక్షించారు. ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్రంలో సమృద్ధి వర్షాలు పాడి పంటలతో సుభిక్షంగా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. ప్రజా పాలన కూటమి ప్రభుత్వం లో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కి ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో బోయ చిన్న స్వమాన్న,లింగస్వామి,శివ,శ్రీను,ధను,రాము,పవన్,విజయ్,అంజి,మధునాయుడు పాల్గొన్నారు.
శ్రీ సాయి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేసిన వీరం ప్రసాద్ రెడ్డి

Leave a Reply