ఘనంగా ప్రపంచ ఐ వి ఎఫ్ దినోత్సవం

*  సంతానలేమికి ఐవీఎఫ్ గొప్ప వరం: డాక్టర్ అరుణకుమారి

*   కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ రవి కృష్ణ, డాక్టర్ సహదేవుడు, డాక్టర్ మధుసూదన్ రావు

నంద్యాల  : స్థానిక పట్టణంలో ప్రపంచ ఐ.వి.ఎఫ్. ( టెస్ట్ ట్యూబ్ బేబీ) దినోత్సవం పద్మావతి నగర్ లోని నెరవాటి ఆసుపత్రి ఆవరణలో నంద్యాల ఐఎంఏ మిషన్ పింక్ హెల్త్ విభాగం  నెరవాటి సంతాన సాఫల్య కేంద్ర  వైద్యురాలు, ఐఎంఏ నంద్యాల మిషన్ పింక్ హెల్త్ అధ్యక్షురాలు డాక్టర్ అరుణకుమారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఐఎంఏ నంద్యాల మిషన్ పింక్ హెల్త్ గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ నాగమణి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ మధుసూదన  రావు, నంద్యాల ఐఎంఏ మాజీ అధ్యక్షులు డాక్టర్ సహదేవుడు, డాక్టర్ నెరవాటి వినోద్ విశిష్ట అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. డాక్టర్ అరుణకుమారి మాట్లాడుతూ వేగంగా మారుతున్న ప్రపంచీకరణ నేపద్యంలో,ఆలస్యంగా వివాహాలు చేసుకోవడం, పని వేళలు మారడం, ధూమ ,మద్యపానం, పని ఒత్తిడి వంటి వివిధ కారణాలు దంపతులలో సంతానలేమి కి దారి తీస్తున్నాయని, టెస్ట్ ట్యూబ్ బేబీ (ఐ వి ఎఫ్ విధానం) కనిపెట్టడం సంతానలేమి తో బాధపడుతున్న దంపతులకు ఒక గొప్ప వరంగా పరిణమించిందన్నారు .గతంలో నగరాలలో మాత్రమే ఉండే ఈ సదుపాయం ఈరోజు నంద్యాల పట్టణంలో కూడా అందుబాటులోకి రావడం జరిగిందని ఇప్పటికే అనేక మంది దంపతులు ఈ విధానం ద్వారా పిల్లలు కనడం జరిగిందన్నారు. డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వానికి ఇటీవల జనాభా పై నిపుణుల అధ్యయన కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలలో జనాభా అధికం చేయాల్సిన అవసరం, అందుకు అనుగుణమైనటువంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రతిపాదించిందని , అదేవిధంగా పేద దంపతులకు సంతాన లేమి ఉన్న పక్షంలో ఆర్థిక సహకారం ప్రభుత్వం ద్వారా అందించడం ద్వారా ఐవీఎఫ్ విధానంలో సంతానం పొందే అవకాశం కల్పించాలని కూడా కమిటీ సూచించారని తెలిపారు. భవిష్యత్తులో మానవ వనరులే దేశ సంపదగా మారనున్నాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ అరుణకుమారి, డాక్టర్ నెరవాటి వినోద్ కుమార్, డాక్టర్ నాగమణి, డాక్టర్ కల్పన, డాక్టర్ నర్మద, డాక్టర్ నాగరేఖ, డాక్టర్ మాధవి, డాక్టర్ రజని, డాక్టర్ సునీత,డాక్టర్ అరిఫా భాను, డాక్టర్ తనూజ, డాక్టర్ ఫాతిమా, డాక్టర్ రాధిక, డాక్టర్ సుసుమ, డాక్టర్ చంద్రకళ, ఆసుపత్రి సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.

Share this