* వైభోవపేతంగా “శ్రీ విశ్వావసు” నామ సంవత్సర “ఉగాది” వేడుకలు
* జిల్లా మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డిలు
ప్రజాపవర్ నంద్యాల : రాష్ట్ర ముఖ్యమంత్రి స్ఫూర్తితో జిల్లా అధికార యంత్రాంగం కష్టపడి సమన్వయంతో పని చేస్తే భవిష్యత్తులో నంద్యాల జిల్లా అభివృద్ధి పథంలో రాష్ట్రంలోనే ముందు వరుసలో ఉంటుందని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ లు అన్నారు. ఆదివారం కలెక్టరేట్ లోని పిజిఆర్ఎస్ హాలులో శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది ఉత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో మంత్రులతో పాటు జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్ తదితర ఉన్నతాధికారులు ఉగాది ఉత్సవాలను పండితుల మంత్రోచ్ఛారణల మధ్య పూజాధి కార్యక్రమాలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలనతో వేడుకలను ప్రారంభించారు. అనంతరం పంచాంగ శ్రవణ కర్తలు ప్రవీణ్ కుమార్ శర్మ, శివకుమార్ శర్మల వారి ఉగాది పంచాంగ శ్రవణాన్ని ఆలకించారు. షడ్రుచుల ఉగాది పచ్చడిని ఆస్వాదించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో చిన్నారుల ప్రదర్శించిన నృత్యాలను తిలకించి కొనియాడారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వచ్చిన తొలి ఉగాది పండుగ కావడంతో, తెలుగువారి సాంప్రదాయం ప్రకారం నిర్వహించుకోవాలని రాష్ట్రముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచన మేరకు ఉగాది ఉత్సవాలను ప్రభుత్వ కార్యక్రమంగా చేపట్టడం జరిగిందన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని… రాష్ట్రంతో పాటు నంద్యాల జిల్లా అభివృద్ధి పథంలో ముందు వరుసలో ఉంటుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అధికారులు, సిబ్బంది అంతా కలిసి ఒక కుటుంబంగా ఈ ఉత్సవాల్లో పాల్గొనడం చూస్తే చాలా ఆనందంగా ఉందన్నారు. ఇంతమంది అధికారులను ఉగాది రోజున ఒకే వేదిక మీదికి తీసుకొచ్చిన ఘనత మాత్రం జిల్లా కలెక్టర్ కే దక్కుతుందన్నారు. బాల భవన్ విద్యార్థులు ప్రదర్శించిన అద్భుత నృత్య ప్రదర్శనకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి 20,000 రూపాయల నగదు పారితోషకాన్ని విద్యార్థులకు బహూకరించారు. ఈ వేడుకల్లో డిఆర్ఓ రాము నాయక్, ఆర్డిఓ విశ్వనాధ్, అన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా అభివృద్ధి పథంలో ముందుండాలి

Leave a Reply