* నిరాడంబరంగా పండగ చేసుకోండి
* జమాఆతె ఇస్లామీ హింద్ నంద్యాల అధ్యక్షులు సమద్
ప్రజాపవర్ నంద్యాల : ఈ నెల 31న ఈదుల్ ఫిత్ర్ ఈద్ నిర్వహించుకుంటున్న ముస్లిం సమాజానికి జమాఆతె ఇస్లామి హింద్ నంద్యాల నగర శాఖ అధ్యక్షులు అబ్దుల్ సమద్ శుభాకాంక్షలు తెలిపారు. రమజాను ఉపవాసాల వల్ల అలవడిన నిష్ట, ఆకలిని సహించే సహనం మనం పేదల పట్ల చూపాలని, రమజాన్ లో పొందిన ఆధ్యాత్మిక భౌతిక శిక్షణ సంవత్సరం అంతా వ్యక్తం కావాలని సమద్ ఆకాంక్షించారు. పండుగ నెపంతో ఆడంబరాలలో మునిగి పోరాదు, మిత్రులను భోజనానికి ఆహ్వానించి వారితో ఆనందం పంచుకోవాలి అని సమద్ కోరారు. ఎందరో పేదలు కడుపు నిండా అన్నానికి నోచుకోలేక పోతున్నారు, ఒంటి పై బట్టలు లేని పేదవారిని శక్తిమేర ఆదుకోవాలని అందుకే జకాత్, ఫిత్రా దానాలు విధిగా చెల్లించాలని, మన చుట్టు ఎవరు ఆకలితో ఉన్నా మనం కడుపు నిండా తినటం విశ్వాసానికి నిదర్శనం కాజాలదన్నారు. ముస్లింలు వ్యక్తిగతంగా, ఈద్ సామూహిక ప్రార్థనల్లో ప్రపంచ శాంతి కోసం, మనదేశం సుభిక్షంగా ఉండాలని, అన్ని మతాలు ఐక్యతకు ప్రతిబింబంగా నిలువాలని, ప్రపంచంలో జరిగె మారణహొమాలు నిలిచిపోవాలని ప్రార్ధించండి అని సమద్ ముస్లిం సమాజాన్ని అభ్యర్ధించారు.
ఈద్ ప్రేమ, సౌభ్రాతృత్వాల మేళవింపు. ఈద్ ఆనందంలో మనిషిలో సోదరభావం ఉప్పొంగాలి. ఈర్షాద్వేషాలను హృదయపుటల నుండి దూరం చేస్తూ ప్రతి హృదయం స్వచ్ఛమైన దర్పనంగా నిలువాలి. ఈద్ వేడుక మనిషిలో భౌతిక, ఆధ్యాత్మిక సాకారానికి నాంది పలుకాలి అని సమద్ తన సందేశంలో పేర్కొన్నారు. యువత పండుగ రోజు, మరసటీ రోజులు వెహికిల్స్ పై వేగంగా పోవడం, సైలెన్సర్ లేకుండా పోతు ఇతరులకు ఇబ్బంది పెట్టడం, ప్రమాదాల వల్ల తలిదండ్రులకు కడుపుకోత పెట్టవద్దని సమాజానికి మార్గదర్శకంగా మెలగాలని యువతను కోరారు.
పేదలను ఆదుకోవడమే ఈద్ అసలు లక్ష్యం

Leave a Reply