ప్రజాపవర్ నంద్యాల : స్ధానిక పట్టణంలోని నందమూరి నగర్ లోని స్టార్ సొసైటీ ద్వారా నిర్వహించబడుతున్న నేతాజీ సుబాష్ చెంద్ర బోస్ ఆవాసియ విద్యాలయమును బుడగజంగాల, రాష్ట్ర సమగ్ర శిక్ష ఐ ఈ డి కో కోర్డినేటర్ కల్పనా ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఉగాది పండగ రోజు ఆయన వందమంది పిల్లలు వుండడం ఆమె సంతోషించారు. హాస్టల్ పరిసరాలను క్షుణంగా పరిశీలించి, నిర్వాహకులు ఆడపిల్లకు, మగ పిల్లలకు వేరువేరుగా వసతులు ఏర్పాటు చేశారు.ఆడపిల్లలకు మూడు టాయిలెట్స్, ఆరు బాతురూములు, మగ పిల్లలకు ఆరు టాయిలెట్స్, ఆరు బాతురూములు, కిచన్,ఎగ్జాస్ట్ ఫ్యాన్, స్టోర్ రూమ్,సీసీ కెమెరాస్ పిల్లల రూములను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ వందమంది పిల్లలతో భోజనాలు, వసతులు,ఆరోగ్య ,విద్య, బాగున్నయని అని పిల్లలను అడిగి తెలుసుకున్నారు. అనంతరము రికార్డులను పరిశీలించారు. బుడగజంగాల పిల్లల కొరకు సంస్థ నిర్వాకులు ఆడపిల్లలకు, మగపిల్లలకు వేరువేరుగా వసతులు ఏర్పాటు చేసి నిర్వహించడము ఎంతో సంతోషించదగ్గ విషయము అన్నారు. ఆమె నిర్వాహకులను అభినందించారు . నిర్వాకులు పిల్లల కొరకు ఇంటి అద్దెలు, పిల్లల రవాణా సౌకర్యార్థం వెహికల్ ఏర్పాటు చేసామణి నిర్వాహకులు ఆమెకు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వము దుష్టికి తీసుకెళుతాని ఆమెహామీ ఇచ్చారు. ఆమె వెంట సి ఆర్ పి హిమశేఖర్, చెంద్రమ్మ గాయత్రి ,హాస్టల్ సిబ్బంది, పాల్గొన్నారు.
బుడగజంగాల హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్త్ర సమగ్ర శిక్ష ఐ ఈ డి కో ఆర్డినేటర్ కల్పనా

Leave a Reply