ప్రజాపవర్ నంద్యాల జిల్లా/ మహానంది : మండల పరిధిలోని ఆర్ఎస్ గాజులపల్లి, ఎం సీ ఫారం గ్రామాల్లో ముస్లిం ప్రజలకు పవనన్న రంజాన్ తోఫా కిట్లు పంపిణీ చేశారు. ఆదివారం జనసేన నాయకులు నల్లబోతుల మల్లికార్జున ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్ సందర్భంగా ముస్లిం ప్రజలకు 30 కిట్లను అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింలు పండుగను సంతోషంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతో, జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదేల పవన్ కళ్యాణ్ పేరు మీద పవనన్న రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేయడం జరిగిందన్నారు. జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదేల పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా, ప్రతినిత్యం పేదలకు చేదోడు వాదోడుగా, ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తూ, పేదలకు అండగా నిలుస్తున్నారని మండలంలోని ప్రజలు పలువురు అభినందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షుడు మారెడ్డి రామయ్య, మహేశ్వరయ్య, చక్రపాణి, శివ, మహేష్ బోణాసి ప్రసాద్, వేణు వెంకటేష్, శ్రీను, కళ్యాణ్,అలాగని మణి బాబు,చిన్న కుళాయి, వుసేనాలం తదితరులు పాల్గొన్నారు.
ముస్లింలకు పవనన్న రంజాన్ తోఫా పంపిణీ

Leave a Reply