సగరుల అభివృద్ధికి సహకరించాలని మంత్రి ఫరూఖ్ కి ఉప్పర సంఘం వినతి

Oplus_131072

ప్రజాపవర్ నంద్యాల :  జిల్లాలో శ్రీ భగీరథ సగర (ఉప్పర) కులస్తుల అభివృద్ధికి సహకరించాలని కోరుతూ నంద్యాల అసెంబ్లీ సగర (ఉప్పర) సంక్షేమ సంఘం, యువజన సంఘం రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూఖ్ ని కలిసి సగర (ఉప్పర) సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షుడు సురేష్ కుమార్ ఆధ్వర్యంలో మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనాదిగా సగరులు విద్య, ఉపాధి రంగాలతో పాటు సామాజికంగా అభివృద్ధి కి నోచుకోలేదని అన్నారు. ముఖ్యంగా నంద్యాల అసెంబ్లీ పరిధిలో సగరుల జనాభా కూడా అధికంగా ఉందన్నారు. అధిక శాతం పేదరికంలో మ్రగ్గుతున్నారని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ఉపాధి అవకాశాల్లో సగరులకు ప్రాధాన్యత కల్పించాలని కోరారు. అలాగే నంద్యాల పట్టణంలో సగరుల కొరకు కళ్యాణ మంటపం నిర్మించాలని,  సగరుల మూల పురుషుడు శ్రీ భగీరథ మహర్షి విగ్రహం ఏర్పాటుకు చిన్న చెరువు కట్టపై  స్థలం కేటాయించాలని, సగరుల అభివృద్ధికి కార్పోరేషన్ డైరెక్టర్ గా నంద్యాల జిల్లా వాసులకు కేటాయించగలరని ద్వారా సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని కోరారు. ఇందుకు మంత్రి ఎన్ఎండి ఫరూఖ్  సానుకూలంగా స్పందించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, అలాగే సగరుల అభివృద్ధికి తన సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా సగర సంఘం అధ్యక్షుడు సురేష్ కుమార్, ప్రధాన కార్యదర్శి సాగర్, నంద్యాల అసెంబ్లీ సగర సంగం అధ్యక్షులు బోయిని బాలాజీ,  చిలకల బాలరాజు,  గోరుకంటి శివ ప్రసాద్ , చిలకల చిన్నయ్య , వెంకటరామయ్య,  యువజన సంఘం అధ్యక్షులు హరికిరణ్,  కుల పెద్దలు పెద్ద ఎత్తున యువకులు సగర సంఘీయులు పాల్గొన్నారు

Share this