నంద్యాల : జాతీయ వైద్యుల దినోత్సవం పురస్కరించుకుని జులై 1 వ తేదీన తిరుమల పునీత్ ఆసుపత్రి ఆధ్వర్యంలో చెవి, ముక్కు, గొంతు నిపుణులు డాక్టర్ అనిల్ కుమార్, చర్మవ్యాధి నిపుణురాలు డాక్టర్ హరితల నిర్వహణలో డాక్టర్ అనిల్ కుమార్ తండ్రి దివంగత డాక్టర్ సత్యనారాయణ జ్ఞాపకార్థం రెండు రోజుల ఉచిత వైద్య శిబిరం మంగళవారం రాష్ట్ర న్యాయ,మైనారిటీ శాఖల మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వల చేసి ప్రారంభించారు. దివంగత వైద్యులు సత్యనారాయణ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ నంద్యాల వైద్యులు సేవా దృక్పథంతో అనేక వైద్య శిబిరాలు,ప్రజా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారని అభినందించారు. వైద్య సదస్సులు, ప్రజా ఆరోగ్య అవగాహన సభలు, వైద్య శిబిరాల నిర్వహణ కోసం నంద్యాల ఐఎంఎ భవనాన్ని నిర్మిస్తామని అభ్యర్థించడంతోవారికిప్రభుత్వస్థలంకేటాయించడానికిప్రతిపాదిస్తున్నామన్నారు. డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ హరిత ప్రతి సంవత్సరం వైద్యుల దినోత్సవం రోజు వారి తండ్రి జ్ఞాపకార్థం ఉచిత వైద్య శిబిరం నిర్వహించి పేదలకు సేవలు అందించడం ప్రశంసనీయమని అన్నారు.
డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ మంత్రి ఎన్ఎండి ఫరూక్ గత నాలుగు దశాబ్దాలుగా నంద్యాల అభివృద్ధిలో కీలక పాత్ర వహించారని, ప్రస్తుతం మంత్రిగా నంద్యాల అభివృద్ధి ధ్యేయంగా కృషి చేస్తున్నారని,ప్రభుత్వ కార్యక్రమాలకు వైద్యుల సహకారం కొనసాగిస్తామన్నారు.నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు, రోటరీ మాజీ గవర్నర్లు కల్లూరి రామలింగారెడ్డి, కందుకూరి శ్రీరామ్మూర్తి, చిన్నపరెడ్డి, రోటరీ క్లబ్ అధ్యక్షులు వివేకానంద రెడ్డి, కార్యదర్శి బాలకృష్ణ సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ ను డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ హరిత దంపతులు ఘనంగా సత్కరించారు. అదేవిధంగా మంత్రి డాక్టర్ మధుసూదనరావు, డాక్టర్ నర్మద, డాక్టర్ కల్పనలకు వైద్య దినోత్సవ పురస్కారాలు అందించి సత్కరించారు.
Leave a Reply