కర్నూలు.: అన్నదాన సత్రం నిర్మాణానికి ఆలయ సమీపంలోనే స్థలం కేటాయించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మాత్యులు శ్రీ బీ సీ.జనార్దన్ రెడ్డి ని బనగానపల్లె పట్టణంలో ఆంధ్రప్రదేశ్ భావసార క్షత్రియ సంఘం రాష్ట్ర నాయకులు మరియు ప్రెసిడెంట్ రవిశంకర్ కలిసి విన్నవించారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలంలో భావసార క్షత్రియ అన్నదాన సత్ర నిర్మాణానికై ప్రభుత్వం కేటాయించనున్న అర ఎకరం స్థలం పరిపాలన అనుమతులు దేవాలయానికి దగ్గర్లోనే ఇప్పించాలని మంత్రిని భావసార క్షత్రియ సంఘం రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. భావసార క్షత్రియ సంఘం జాతీయ అడిషనల్ జనరల్ సెక్రెటరీ మరియు శ్రీశైలం అన్నదాన సత్ర సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు హంచాటే రవిశంకర్ రావు ఆధ్వర్యంలో భావాసార క్షత్రియులు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డినీ కలిసి శ్రీశైలం అన్నదాన సత్ర స్థలం విషయంలో సహకరించమని కోరారు. భావసార జాతికి శ్రీశైలంలో అర్ధ ఎకరాన్ని కేటాయించడానికి ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ మేరకు సమ్మతి తెలుపుతూ శ్రీశైలం దేవస్థానం భావసార క్షత్రియ సంఘానికి లేఖ ఇచ్చిందని, తదనంతరం స్థల కేటాయింపు కోసం 50 లక్షల రూపాయల డిపాజిట్ ను శ్రీశైలం దేవస్థానం ఈవో గారికి సమర్పించామని మంత్రికి తెలియజేశారు. శ్రీశైలంలో భావసార క్షత్రియ అన్నదాన సత్రం నిర్మాణానికి సంబంధించి కేటాయించనున్న అర ఎకరా స్థలం ఫైలు ప్రస్తుతం రాష్ట్ర దేవాదాయ శాఖ వద్ద పెండింగ్లో ఉందని, ఆ ఫైలుకు త్వరితగతిన క్లియర్ చేసి బావసార్లకు శ్రీశైల దేవస్థానంలో అర ఎకరా స్థలం కేటాయింఫుకు సంబంధించి పరిపాలన అనుమతులు ఇప్పించాలని వారు కోరారు.. ఈ సందర్భంగా మంత్రి బీసీ. జనార్దన్ రెడ్డి స్పందిస్తూ తక్షణమే దేవదాయ శాఖ అధికారులకు ఫోన్ చేసి మాట్లాడారు. తప్పకుండా భావసారులకు శ్రీశైలంలో అన్నదాన సత్రానికి స్థలం కేటాయించే విషయంలో సహకరిస్తానని, చొరవ తీసుకొని స్థల కేటాయింపు ను త్వరితగతిలో పూర్తి చేస్తానని భవసారులకు హామీ ఇచ్చారు. అలాగే అన్నదాన సత్రం నిర్మించి భక్తులకు సేవ చేసేందుకు సంకల్పించిన భావసార క్షత్రియ సంఘం రాష్ట్ర కమిటీ ,అన్నదాన సత్ర సొసైటీ నాయకులను మంత్రి అభినందించారు. మంత్రిని కలిసిన వారిలో అన్నదాన సత్ర సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు హాంచాటే రవిశంకర్ రావు, భవసార క్షత్రియ మొదటి రాష్ట్ర ప్రెసిడెంట్ హంచాటే నాగేంద్ర బనగానపల్లె భవసార క్షత్రియ సభ్యులు గోపాల్ నంద్యాల నాయకులు లోకనాథ్ ,రవి ,నందికొట్కూరు నాయకులు భవాని కుమార్ లతోపాటు ఆళ్లగడ్డ ,కర్నూల్ ,సంజామల తదితర ప్రాంతాల నుంచి దాదాపు 100 మంది నాయకులు పాల్గొన్నారు.
అన్నదాన సత్రం స్థల నిర్మాణం దేవాలయానికి దగ్గరలో అనుమతులు ఇవ్వండి

Leave a Reply