ఫ్రెండ్ షిప్ కప్ క్రికెట్ విజేత గురు రాజా స్కూల్ సిబ్బంది జట్టు

*  బహుమతి ప్రదానం చేసిన డాక్టర్ రవి కృష్ణ
*  రన్నర్స్ కప్ అందుకున్న నంద్యాల లయన్స్ క్లబ్
*   బెస్ట్ బ్యాట్స్ మన్ షావలి,బెస్ట్ బౌలర్ చంద్రమౌళి

ప్రజాపవర్  నంద్యాల :   లయన్స్ క్లబ్, శ్రీ గురు రాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టాఫ్ జట్టుకు మధ్య ఆదివారం రాత్రి ఫ్లడ్ లైట్స్ లో జరిగిన క్రికెట్ పోటీలలో గురురాజా ఇంగ్లీష్ మీడియం స్కూల్ జట్టు విజేతగా నిలిచి ఫ్రెండ్ షిప్ కప్ ట్రోఫీ కైవసం చేసుకుంది.జట్టుకు 10 ఓవర్ల చొప్పున జరిగిన మూడు మ్యాచ్ లలో కూడా గురు రాజా జట్టు విజేతగా నిలవడం విశేషం. ప్రారంభ మ్యాచ్ లో 5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి విజయానికి కావలసిన 66 పరుగులు సాధించి గురురాజా మ్యాచ్ గెలుచుకుంది.రెండో మ్యాచ్ లో లయన్స్ క్లబ్ 10 ఓవర్లలో 125 పరుగులు చేయగా గురురాజా 8 ఓవర్లలో విజయానికి కావలసిన పరుగులు సాధించింది. చివరి మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన గురు రాజా 127 పరుగులు సాధించగా లయన్స్ క్లబ్ 102 పరుగులు మాత్రమే చేయడంతో గురు రాజా జట్టు మూడో మ్యాచ్ 25 పరుగుల తేడాతో గెలుచుకుంది. టోర్నమెంట్ ముగిశాక జరిగిన బహుమతి ప్రధానోత్సవం లో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, నంద్యాల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొని విజేత గురు రాజా జట్టు షావలి రెడ్డి కి ఫ్రెండ్షిప్ కప్  ట్రోఫీ, రన్నర్స్ గా నిలిచిన లయన్స్ క్లబ్ కెప్టెన్ మనోహర రెడ్డికి  రన్నర్స్ కప్ అందించి అభినందించారు. మూడు మ్యాచ్ లలో కలిపి 115 పరుగులు సాధించిన షావలి రెడ్డి బెస్ట్ బ్యాట్స్ మన్ గా, మూడు వికెట్లు సాధించి చక్కటి బౌలింగ్ ప్రదర్శన చేసిన చంద్రమౌళీశ్వర రెడ్డి బెస్ట్ బౌలర్ గా జ్ఞాపికలు అందుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ ఈ విధమైన క్రీడా పోటీలు ఉల్లాసం కలిగించి వృత్తి,ఉద్యోగాలలో మరింత మెరుగ్గా రాణించటానికి దోహదపడుతుందన్నారు.
కార్యక్రమంలో రెండు జట్ల సభ్యులు పాల్గొన్నారు.

Share this