కర్నూలు జిల్లా కౌతాళం : మండల పరిధిలోని ఉరుకుంద గ్రామంలో వెలసిన ప్రముఖ పుణ్యక్షేత్రం నరసింహ ఈరన్నస్వామి దేవస్థానంలో ఈ హుండీ లెక్కింపు దేవస్థానం డిప్యూటీ కమీషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ మేడేపల్లి విజయరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. మార్చి 5నుంచి మే 1 వరకు స్వామివారి హుండీ ఆదాయం లెక్కించారు. హుండీ ఆదాయం రూ.1,14,68,836, బంగారం 29 గ్రాములు,.వెండి 13 కేజీలు వచ్చిందని అధికారులు చెప్పారు.ఈ కార్యక్రమంలో హుండీ పర్యవేక్షణ అధికారి శ్రీ యస్.వెంకటేష్ ఇన్స్పెక్టర్, ఆదోని, దేవస్థాన పర్యవేక్షకులు, అర్చకులు మరియు ఇతర సిబ్బంది, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఉరుకుంద సిబ్బంది మరియు శ్రీ భ్రమరాంబ సేవసమితి ఆదోని వారు పాల్గొన్నారు.
ఈరన్నస్వామి స్వామి హుండీ ఆదాయం రూ. 1,14,68,836

































Leave a Reply
View Comments