నంద్యాల : రాష్ట్రీయ ధర్మ రక్షా దళ్ ఆధ్వర్యంలో నూనెపల్లె ప్రభుత్వ ఠాగూర్ పాఠశాల నందు భరతమాత వీర పుత్రిక ఝాన్సీ లక్ష్మీబాయి వర్ధంతి సందర్భంగా వీర వనిత చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ ధర్మ రక్షా దళ్ నంద్యాల జిల్లా అధ్యక్షులు ఎన్ పి నవీన్ గౌడ్,జిల్లా ఉపాధ్యక్షులు జె శివ,సహకార్యదర్శి జి ప్రతాప్,మండలం అధ్యక్షులు కె సతీష్, బిజెపి జిల్లా జనరల్ సెక్రటరీ మండ్ల గంగాధర్,కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు తాడి రామకృష్ణ రెడ్డి, పి మహేష్ గౌడ్,పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమణ, ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.
ఝాన్సీ లక్ష్మీబాయి వర్ధంతి ఘనంగా

Leave a Reply