హైదరాబాద్ : చంపాపేటలో నాగేశ్వర ఆయుర్వేదిక్ ఆసుపత్రిని గురువారం మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆయుర్వేదానికి పుట్టినిల్లు భారతదేశమని ఈనాటికి హిమాలయాల్లో అనేక ఔషధ మొక్కలు మానవ ఆరోగ్యానికి కాపాడుతున్నాయన్నారు. కరోనా వచ్చినప్పుడు అన్ని దేశాలు బెంబేలెత్తి భయపడుతుంటే ధైర్యంగా ఉన్న దేశం భారతదేశం అని,మన ఇంట్లో ఉన్న పోపులు పెట్టే ఆయుర్వేద వైద్యాన్ని అందించి మన వ్యాధి నిరోధకతను కాపాడుతుందని,భారతదేశంలో ఇంత జనాభా ఉన్న ఇన్ని బస్తీలు ఉన్న కరోనాను తట్టుకోగలిగదానికి ఒక కారణం మన పోపులో పెట్టె అది చాలామందిని కాపాడిందని,ఆయుర్వేదంలో క్యాన్సర్‌ను అరకట్ట లేకపోవచ్చు కానీ క్యాన్సర్ వచ్చిన పేషెంట్లకు వ్యాధి నిరోధక శక్తి పెంచుతుందని అన్నారు.ఈమధ్య నేను ఈశాన్య రాష్ట్రాలు సందర్శించినప్పుడు అక్కడ ఒక హాస్పటల్లో చూశాను మన మూలికలతోనే అనేక జబ్బులకు చికిత్స చేస్తున్నారు.అలాగే నాగేశ్వర ఆయుర్వేదిక్ హాస్పిటల్ ప్రాక్టికల్ గా ఉంటూ మంచి సేవలు అందించాలని ఆయన సందర్భంగా కోరారు.అనంతరం మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ ను నాగేశ్వర ఆయుర్వేద వైద్యశాల మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ఆకుల నాగేష్ మరియు సిబ్బంది కలిసి ఆయనను ఘనంగా సన్మానించారు.
నాగేశ్వర ఆయుర్వేద ఆసపత్రిని ప్రారంభించిన పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్

Leave a Reply