ముగిసిన మొహర్రం వేడుకలు

 నంద్యాల జిల్లా  గడివేముల  : మొహర్రం వేడుకలు ఆదివారం ఘనంగా ముగిశాయి. మండలంలోని గడివేముల, పెసరవాయి, గని, కరిమద్దెల తదితర గ్రామాల్లో పీర్ల పండుగను కులమతాలకు అతీతంగా భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. మొహరం నెల ప్రారంభంలో పీర్లను ఆశుర్ ఖానాలో కూర్చోబెట్టి పది రోజుల పాటు ఫాతిహాలు నిర్వహించారు. పదవరోజు పీర్లను ఆయా గ్రామాల్లో డప్పు చప్పుళ్ల  మధ్య ఊరేగించి సాయంత్రం చెరువుల వద్ద, బావుల వద్దకు తీసుకెళ్లి శుద్ధిచేసి తిరిగి యధావిధిగా పీర్లచావిళ్ల కు చేర్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ నాగార్జున రెడ్డి పోలీసు బందోబస్తు నిర్వహించారు.

Share this