అంతర్జాతీయ వైద్య సదస్సులో నంద్యాల వైద్యుడు డాక్టర్ చిత్తలూరి మణిదీప్

*   బెంగళూరులో చెవి శస్త్ర చికిత్సల 7వ అంతర్జాతీయ సదస్సు

*   చెవి ప్రత్యక్ష శస్త్ర చికిత్స పై చర్చకు సమన్వయ కర్త గా వ్యవహరించిన మణి దీప్

నంద్యాల  : ఇటీవల బెంగళూరులో జరిగిన ఏడవ అంతర్జాతీయ ప్రత్యక్ష శస్త్ర చికిత్సల సదస్సులో రివిజన్ కొలీస్టీయటోమా ప్రత్యక్ష శస్త్ర చికిత్స పై ముగ్గురు జాతీయ స్థాయి చెవి శస్త్ర చికిత్సల నిపుణులు డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ సింగరి ప్రభాకర్, డాక్టర్ పలనియప్పన్ లతో నిర్వహించిన చర్చకు నంద్యాలకు చెందిన మధుమణి నర్సింగ్ హోమ్ చెవి ముక్కు గొంతు శస్త్ర చికిత్స నిపుణులు డాక్టర్ చిత్తలూరి మణిదీప్ సమన్వయకర్తగా వ్యవహరించారు. జాతీయ చెవి ముక్కు గొంతు వైద్య నిపుణుల సంఘం మాజీ అధ్యక్షులు డాక్టర్ విజయేంద్ర డాక్టర్ మణిదీప్ కు ప్రశంసాపత్రంఅందజేసిఅభినందించారు.అంతర్జాతీయ సదస్సులో సమన్వయకర్తగా పాల్గొని ప్రశంసా పత్రం అందుకున్న  డాక్టర్ మణిదీప్ కు ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ విజయభాస్కర రెడ్డి, నంద్యాల అధ్యక్షులు డాక్టర్ మధుసూదనారావు, కార్యదర్శి డాక్టర్ పనిల్ కుమార్,నంద్యాల సీనియర్ వైద్యులు డాక్టర్ సహదేవుడు, ఐఎంఏ రాష్ట్ర కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూదన్ రెడ్డి అభినందనలు తెలిపారు.

Share this