జూన్ లో ప్రతి విద్యార్థికి తల్లికి వందనం ఎమ్మెల్యే ముత్తుముల స్పష్టికరణ

ప్రకాశం జిల్లా/రాచర్ల : ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద కూటమి ప్రభుత్వం 15 వేల రూపాయలు జూన్ నెలలో జమ చేస్తుందని గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి అన్నారు. గిద్దలూరు పట్టణంలోని ఎస్ఎస్ ప్లాజా నందు జరిగిన ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ (అపుస్మా) జిల్లా కార్యవర్గ సమావేశంలో తెలిపారు.ప్రైవేట్ స్కూల్ సమస్యలపై ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హాయంలో ప్రైవేట్ స్కూల్స్ అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నాయని గుర్తుచేశారు.ప్రస్తుత కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థలో మార్పుల కోసం మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ విశేష కృషి చేస్తున్నారని తెలిపారు.వారి దృష్టికి ప్రైవేట్ స్కూల్స్ సమస్యలైన రెన్యువల్ ఆఫ్ రికగ్నేషన్ 10 సంవత్సరాలు పెంచుట, ఆర్టిఇ చట్టం, ప్రైవేట్ స్కూల్స్ రక్షణ చట్టం మరియు ఆర్.టి.ఐ లాంటి చట్టాల గురించి చర్చించి సానుకూల నిర్ణయాలు తీసుకొనేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్ర బాబునాయుడు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం సంఘ ప్రతినిధులు ముత్తుములను ఘనంగా సన్మానించారు.కార్యవర్గ సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా అధ్యక్షులు కె.మాధవరావు మాట్లాడుతూ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు ఇలాగే ఐక్యమత్యంతో మెలిగి సమస్యలు పరిష్కరించుకోవాలన్నారు.గిద్దలూరు ప్రెసిడెంట్ పి.సుధీర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే మంచి మనసుతో మా సమస్యలు విని ప్రైవేట్ స్కూల్ సమస్యల పరిష్కారానికి చొరవ చూపిస్తానన్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రీజనల్ ప్రెసిడెంట్ ఎ.వి.సుబ్బారావు, జిల్లా గౌరవాధ్యక్షులు బి.హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి జి.మల్లికార్జున రెడ్డి, ట్రెజరర్ యం.వెంకటేశ్వర రెడ్డి, స్టేట్ జాయింట్ సెక్రటరీ ఖాజావలి,గిద్దలూరు యూనిట్ గౌరవాధ్యక్షులు జి.రత్నం బాబు, ప్రధాన కార్యదర్శి జెడ్.చంద్ర శేఖర్, ట్రెజరర్ కె.గణేష్ యాదవ్, మరియు 80 మందికి పైగా జిల్లాలోని వివిధ పాఠశాలల కరస్పాండెంట్లు పాల్గొన్నారు.

Share this