* కృష్ణానదిలో నిషేదిత అలివి వలలు వేసేవారిపై చర్యలు
* నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి
ప్రజాపవర్ నంద్యాల : స్థానిక కృష్ణానదిలో మత్స్య సంపదపై మత్స్య కారులకే పూర్తి హక్కు ఉందని, నిషేదిత అలివి వలలతో కృష్ణా నదిలో స్థానికేతరులు గాలం వేయడం నేరమని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.మంగళవారం ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఓ ప్రకటన విడుదల చేశారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ కృష్ణానది ఒడ్డున దళారులు తిష్ఠవేయడాన్ని , మత్స్య సంపదను కొల్లగొట్టడాన్ని తాము అంగీకరించేది లేదన్నారు. నందికొట్కూరు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుందని, ఈ ఏడాది కృష్ణానదిలో స్థానిక మత్స్యకారుల సంఘాలతో, జిల్లా మత్స్య శాఖ అధికారులతో కలిసి 2 లక్షల చేప పిల్లలను తన చేతులమీదుగా నదిలో వదిలామని, ఆ చేప పిల్లలు పెద్ద సైజ్ గా తయారు అయ్యి, వాటిని పట్టుకొని స్థానిక మత్స్యకారులకు ఆర్ధిక భరోసా కల్పించాలనే ఉద్దేశ్యంతో నదిలో రెండు లక్షలు చేపపిల్లలు ఇటీవలే వదిలాం అని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి వివరించారు. నదిలో అవి పెరిగిన తర్వాత స్థానిక మత్స్యకారులు పట్టు కోవడానికి అనుమతి ఉందని, ఇందుకు కృష్ణానది పరివాహక ప్రాంతంలో 1,200 మంది స్థానిక జాలర్లకు మత్స్య పరిశ్రమ శాఖ ద్వారా లైసెన్సులు కూడా ఇవ్వడం జరిగిందని ఎంపీ బైరెడ్డి శబరి వివరించారు. నందికొట్కూరు మండలం జంగంపాడు, బిజి నవేముల, పగిడ్యాల మండలంలోని నెహ్రూనగర్, ముచ్చుమర్రి, కొత్తపల్లి మండలంలో జానాల గూడెం, బలపాలతిప్ప, సంగమేశ్వరం ప్రాంతాల్లో విశాఖ జాలర్లు గుడారాలు వేసుకున్నారన్న సమాచారం ఉందని, వారు అలివి వలలతో నదిలో చేపలు వేటాడుతున్నట్లు స్థానికులు చెబుతున్నారని, వెంటనే నంద్యాల జిల్లా మత్స్య శాఖ, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయం దాడులు చేసి నదిలో అలివి వలలు వేసే స్థానికేతరులపై చర్యలు తీసుకోవాలని, స్థానిక మత్స్యకారులకు ప్రభుత్వం భరోసా కల్పించాలని ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కోరారు.
Leave a Reply