నంద్యాల జిల్లా బనగానపల్లె మండలంలోని టంగుటూరు గ్రామంలో రైతు పొలంలో నిలువ చేసుకున్న పొగాకు బెల్లు అగ్నికి దగ్ధం కావడంతో 8 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. గ్రామానికి చెందిన కౌలు రైతు ఆకుమల్ల రాజన్న ఐదు ఎకరాల్లో కష్టపడి పండించిన పొగాకు ను బెల్లు తొక్కి అమ్మే సమయానికి రాత్రి ఉన్నట్టుండి మంటలు వ్యాపించి కాలిపోవడంతో రైతు తీవ్రంగా నష్టపోయారు. సొంతం భూమి లేక గుత్తా కు తీసుకొని 8 నెలలు ఎంతో కష్టపడి పొగాకు పంట పండించి ఎండలో ఎండబెట్టి అమ్మే సమయానికి కంటి ముందర పంట అగ్నికి బూడిద పాలు కావడం కౌలు రైతు రాజన్నకు తీరని దుఃఖాన్ని చేరదీసింది. “ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే మా కుటుంబాన్ని ఆదుకోవాలని బాధితుడు కౌలు రైతు ఆకుమల్ల రాజన్న కోరారు.
కష్టపడి పండించిన పంట బూడిద పాలు

Leave a Reply