నంద్యాల : ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి బదిలీలు సర్వసాధారణమే అని ఎంఈఓ శివరాం ప్రసాద్ అన్నారు. నంద్యాల మండలం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అబాన్డం తాండ ప్రధానోపాధ్యాయుడు దస్తగిరి బదిలీ పై వెళ్తున్నందున ఉపాధ్యాయులు మరియు గ్రామస్థులు ఆయనను ఘనంగా సన్మానించారు.మండల విద్యాశాఖాధి కారి 2 శ్రీ శివరాం ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా హాజరయ్యా మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగంలో ఎక్కడికి వెళ్లిననో అక్కడి వారి మననలను పొందేందుకు ప్రయత్నించాలని అన్నారు. అనంతరం పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షుడు రామ పక్కిరెడ్డి . భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతము విద్యావ్యవస్థ ఒక గాడిన పడిందని ప్రతి విద్యార్థి తప్పక పాఠశాలకు వచ్చేందుకు ప్రభుత్వము ఎన్నో ఉచిత పథకాలను ప్రవేశపెట్టిందని వీటిని సద్వినియోగం చేసుకొని ప్రతి చిన్నారి తన భవిష్యత్తును ఉజ్వాలాంగా తీర్చిదిద్దుకోవాలని. అన్నారు,ఈ సన్మాన కార్యక్రమంలో గ్రామ పెద్దలు స్వామి నాయక్.విద్యార్థుల తల్లి దండ్రులు ఘనంగా సన్మానించి దస్తగిరి పాఠశాలకు చేసిన సేవలను కొనియాడారు.ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి భారతి.ఉపాధ్యాయులు అబ్బాస్ ఖాన్.శ్రీమతి పద్మిని.విజయ రావు సు బాన్.ప్రేమ కుమార్ లు పాల్గొన్నారు.
ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి బదిలీ సర్వసాధారణమే ఎంఈఓ 2 శివరాం ప్రసాద్

Leave a Reply