ప్రజాపవర్ : మన ఆరోగ్యం కోసం ఎన్నో వ్యాయామాలు చేస్తాం. దీనిలో భాగంగా ఆరోగ్య నిపుణులు ప్రకారం వాల్ నట్స్ ని రాత్రి నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తింటే చాల ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి వాల్ నట్స్ లో ఎన్నో పోషకాలు దాగివున్నాయి. దీని వల్ల ఎన్ని రకాల లాభాలు వున్నాయో తెలుసుకుందాం. వాల్ నట్స్ తింటే మెదడుపై పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది. దీనిలో ఒమేగా 3 ప్యాటి యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. దీంతో మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. మానసిక సమస్యలు పరిష్కారం అవుతాయి. జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
వీటిని తింటే జీర్ణ వ్యవస్థ మెరుగైన మలబద్దకం, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. పేగు ఆరోగ్యాన్ని కూడా మెరుగ్గా చేస్తుంది.వాల్ నట్స్ తింటే బరువుని అదుపు చేయడానికి సాయపడతాయి. దీనిలో ఎక్కువ మొత్తంలో ఫైబర్, ప్రోటీన్ కంటెంట్ కలిగి ఉంటుంది. అవి మనకు కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది. క్యాలరీలను తగ్గిస్తాయి. దీంతో శరీర బరువు పెరగదు.వాల్ నట్స్ లొ మెగ్నీషియం, కాల్షియం, పాస్సరస్ పుష్కలంగా ఉంటాయి. దీనితో ఎముకల ఆరోగ్యాని కాపాడుతాయి. ఎముకల సమస్యలు పరిష్కారం అవుతాయి.వాల్ నట్స్ లో అధిక మొత్తంలో జింక్, విటమిన్ ఇ వుంటుంది. కాబట్టి మన ఇమ్యూనిటి పెరుగుతుంది.వాల్ నట్స్ నానబెట్టి తినడం ద్వార నిద్ర నాణ్యత పెరుగుతుంది. నిద్ర సమస్య దూరమవుతుంది. వాల్ నట్స్ లో మెలటోనిస్ అనే హార్మోన్ వుంటుంది. ఇది రాత్రిపూట నిద్ర పోవడానికి సహాయపడుతుంది.వాల్ నట్స్ తినడం ద్వార ఆందోళన, ఒత్తిడిని తగ్గిస్తుంది. ఆలాగే మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వాల్ నట్స్ హెల్దీ ఫ్యాట్, యాంటి ఆక్సిడెంట్స్ వుంటాయి. ఇవి శరీరంలోని కొలెస్ట్రాల్ నీ తగ్గిస్తాయి. దీంతో బి పి కంట్రోల్ లో వుండి గుండె సమస్యలు కూడా దూరమవుతాయి. వాల్ నట్స్ మన అందాన్ని కూడ పెంచుతాయి. ఎందుకంటే వీటిలో విటమిన్ బి 5, విటమిన్ ఇ, ఎక్కువగా ఉంటాయి.వాల్ నట్స్ లోని పోషకాలు నానబెట్టి ఉదయం తింటే శరీరం ఈజీగా అబ్జార్బ్ చేసుకుంటుంది. దీని కోసం గ్లాసు నీటిలో వాల్ నట్ ని నానబెట్టి ఉదయాన్నే కడిగి తీసుకోవాలి.
గమనిక : ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలు అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. వీటిని పాటించే ముందు డైటీషియన్ ని సంప్రదించడం ఉత్తమ మార్గమని గమనించగలరు.
Leave a Reply