800 లీటర్ల సారా ఊట ధ్వంసం

ప్రజాపవర్ నంద్యాల : గడివేముల మండలంలోని ఎల్కే తాండ సమీపంలో 800 లీటర్ల నాటు సారా ఊటను నంద్యాల ఎక్సైజ్ సూపరిండెంట్ రవికుమార్ ఆదేశాల మేరకు దాడులు నిర్వహించి ధ్వంసం చేసినట్లు నంద్యాల ఎక్సైస్ సీఐ కృష్ణమూర్తి పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను గుర్తించి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దీంతోపాటు మహానంది మండలంలోని గోపవరం గ్రామంలో 2 బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించి 11 మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకొని ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేశామని ఎక్సైజ్ సీఐ పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ ఎస్సై బ్రహ్మయ్య ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Share this