ప్రజాపవర్ నంద్యాల : స్థానిక పట్టణంలోని 4 వార్డ్ టిడిపి ఇంచార్జి షేక్ మజీద్ ఆధ్వర్యంలో 4 వార్డ్ లో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు . నంద్యాల 4 వార్డు లో ప్రజల దాహార్తిని తీర్చేల చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని ఇంచార్జ్ షేక్ మజీద్ ను అభినందించారు . అలాగే రాష్ట్ర మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆదేశాలతో నంద్యాలలోని ప్రధాన కూడళ్ళలో చలువ పందిర్లు మరియు వివిధ ప్రధాన సెంటర్ల నందు చలి వేంద్రాలు ప్రభుత్వం తరుపున ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే వివిధ స్వచ్ఛంద సంస్థల సైతం చలివేంద్రాలు ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలన్నారు.
ఈ కార్యక్రమంలో డియాల రంగ ప్రసాద్ , భాషా ఖాన్ , బింగుమల్లె శ్యాంసుందర్ గుప్తా , ఉప్పరి సురేష్ కుమార్ , బద్రిశెట్టి రవి , చిన్న యూసుఫ్ , చిన్న సలాం , సునీల్ , హల్దీరామ్ , ఆనంద్ కుమార్ , వాహిద , ఖాజ , సోహెల్ , షఫీ ఉల్లా , ఖాదర్ బాషా , అలబ ఖాఫ్ , మాధవరావు , గంగాధర్ , బోరింగ్ భాషా తదితరులు పాల్గొన్నారు
Leave a Reply