ప్రజాపవర్ : మనం సంపూర్ణ ఆరోగ్యం కోసం.. ప్రకృతి సిద్ధంగా లభించే ఆహారపదార్థాలు ఎంచుకుంటే చాలు. అలాంటి పండ్లలో నేరేడు ఒకటి. నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే ఈ పండు పోషకాల గని.. అనారోగ్యాల నివారణి. నేరేడు శక్తి నందించి.. ఆరోగ్యానికి మేలు చేయడమే కాదు.. కొన్నిరకాల రోగాలనూ నియంత్రించే శక్తి నేరేడు సొంతం. ఒక్క పండే కాదు.. ఆకులు.. బెరడు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఆక్సాలిక్ టాన్మిక్ ఆమ్లం, విటమిన్లు, క్రోమియం.. వంటివి నేరేడులో పుష్కలం.నేరేడుపండు ఆరోగ్యానికి మంచిది. ఔషధగుణాలు కల్గిన చెట్టు అది. ప్రతీ 100గ్రాముల నేరేడులో ప్రోటీన్స్ 0.07శాతం, క్రొవ్వులు 0.3, ఖనిజాలు 0.04, నారం 0.9, పిండిపదార్ధాలు 15మి.గ్రా., ఫాస్ఫరస్ 15, ఐరన్ 1.2, విటమిన్ సి 18మి.గ్రా. ఉంటాయి. దీనిలో ఉన్న చక్కెరలో గ్లూకోజ్, ప్రక్టోజ్‌లు ముఖ్యమైనవి. నేరేడులో ఉన్న ఆవ్లుగుణంవల్ల దీన్ని జామ్‌లు, వెనిగర్, సాండీస్, ఆల్కహాల్, తక్కువశాతం ఉండే వైన్‌ల తయారీలో వాడుతుంటారు.నేరేడు పండ్లు ఆరోగ్యానికి బహు విధాలుగా ఉపయోగాపడుతాయి. అందుకే ఈ పండ్లను ఆరోగ్య ఫలప్రధాయిని అని పిలుస్తుంటారు. ఈ ఆరోగ్య ఫలప్రధాయినిలో ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.డయాబెటిక్ కు మంచిది: నేరేడు పండ్లలో అతి తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల ఇవి డయాబెటిక్ పేషంట్లకు చాలా మంచిది. ఇది డయాబెటిక్ రోగుల్లో బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచడమే కాదు, సాధరణంగా వచ్చే డయాబెటిక్ లక్షణాలు తరచూ దాహం మరియు తరచూ యూరినేషన్ వంటి లక్షణాలను నివారిస్తుంది. ఇది మధుమేహ బాధితులకు వరంలా పనిచేస్తుంది. గింజల్ని ఎండబెట్టి పొడిగా చేసుకొని నీటిలో కలుపుకొని తాగితే శరీరంలో చక్కెర నిల్వలు తగ్గుతాయి.నేరేడు పండ్లులో పొటాషియం కంటెంట్ అత్యధికంగా ఉంటుంది . 100గ్రాముల పండ్లలో 55mg ల పొటాషియం ఉంటుంది. అనారోగ్యకరమైన ఆహారం తీసుకొనే వారిలో కొన్ని పోషకాహారాల లోపం వల్ల గుండె జబ్బలకు కూడా దారి తీస్తుంది. కాబట్టి యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే ముదురంగు ఆహారాలైన నేరేడు పండ్లు మరియు టమోటో వంటి పండ్లను తరచూ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి.
నేరేడు పండు వీరు తినకూడదు..
అయితే నేరేడు పండ్లను గర్భిణీలు ఎటువంటి పరిస్థితులలో తినకూడదు.నేరేడు అరగడానికి ఎక్కువసమయం పడుతుంది కాబట్టి.. ఉప్పు వేసి అప్పుడప్పుడు తీసుకోవాలి. భోజనమైన గంట తరువాత ఈ పండ్లు తీసుకుంటే.. ఆహారం జీర్ణమవుతుంది. అధికంగా తీసుకుంటే.. మలబద్ధకం సమస్యతోపాటు.. నోట్లో వెగటుగా ఉంటుంది.
నేరేడు పండ్లు తింటే ఎన్ని లాభాలో తెలుసా?

Leave a Reply