శిశిరం నాకు మరింత గుర్తింపునిస్తుంది : చైల్డ్ సూపర్ స్టార్ లిటిల్ భాను

ప్రజాపవర్ తెనాలి : శిశిరం చిత్రం ప్రధాన పాత్ర పోషిస్తున్నాను.ఈ చిత్రం ద్వారా నాకు మరింత గుర్తింపు వస్తుందని బాల నటుడు, తండేల్ ఫేమ్ భాను ప్రకాష్ అన్నారు. స్థానిక ప్రిన్సెస్ హోటల్ లో శిశిరం చిత్ర యూనిట్ విలేఖర్ల సమావేశం నిర్వహించారు. భాను మాట్లాడుతూ కళల కణాచి తెనాలిలో షూటింగ్ లోపాల్గొనడం సంతోషకరమన్నారు.  అనుభవజ్ఞులైన రత్నాకర్ దర్శకత్వంలో సినిమాలో నటించడం ఆనందంగా ఉందన్నారు. దర్శకుడు రత్నాకర్ మాట్లాడుతూ ఏప్రిల్ 9 నుంచి 11 వరకు తెనాలి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుందన్నారు. తండేల్ చిత్రంలో జాతీయ సమైక్యతను చాటి చెప్పే పాత్రలో భాను అద్భుత నటన చేసినందుకు గాను భాను ను తహసీల్దార్ గోపాల కృష్ణ, ఏం. ఇ. వో మేకల లక్ష్మీ నారాయణ,  వన్ టౌన్ సి.ఐ మల్లికార్జున రావు, కొరియా గ్రాఫర్ అమ్మ సుధీర్ లు అభినందించారు. సమావేశంలో ప్రొడక్షన్ డిజైనర్ ఎం. శ్రీకాంత్, పి. ఆర్. ఓ అంబటి శ్యామ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Share this