సివిల్ డిఫెన్స్ వాలంటీర్లుగా  నమోదు చేసుకోవటానికి యువతకు అవకాశం : కిరణ్మయి దేవిరెడ్డి

గుంటూరు : మై భారత్ పోర్టల్ లో సివిల్ డిఫెన్స్ వాలంటీర్లుగా రిజిస్టర్  చేసుకోవాలని యువతను గుంటూరు జిల్లా నెహ్రు యువ అధికారి  కిరణ్మయి దేవిరెడ్డి  ఒక ప్రకటనలో కోరారు.భారత ప్రభుత్వ యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ,మై భారత్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా యువతను దేశానికీ ఉపయోగపడే విధంగా,ముఖ్యంగా అత్యవసర పరిస్థితులు మరియు సంక్షోభ సమయాల్లో కీలక పాత్రలు పోషించడానికి సాధికారత కల్పించే సమిష్టి ప్రయత్నంలో భాగంగా  ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు, ప్రజా అత్యవసర పరిస్థితులు మరియు ఇతర ఊహించని పరిస్థితులలో ప్రతిస్పందించే విధంగా స్వచ్ఛంద సేవకులను నిర్మించడం మే లక్ష్యంగా  మై  భారత్ సివిల్ డిఫెన్స్ వాలంటీర్లు గా నమోదు చేసుకోవడానికి ఇది ఒక సువర్ణ అవకాశం అని అన్నారు.ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న భద్రతా సమస్యల దృష్ట్యా, బలమైన, సమాజ  ఆధారిత ప్రతిస్పందన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని,యువత భాగస్వామ్యంతో  స్థానిక ప్రభుత్వ యంత్రాంగానికి   రెస్క్యూ, తరలింపు కార్యకలాపాలు, ప్రథమ చికిత్స మరియు అత్యవసర సంరక్షణ, ట్రాఫిక్ నిర్వహణ, జన సమూహ నియంత్రణ, ప్రజా భద్రత, విపత్తు ప్రతిస్పందన మరియు పునరావాస ప్రయత్నాలలో సహాయం చేయడం వంటి  సేవల ద్వారా మద్దతు ఇవ్వడం ద్వారా పౌర రక్షణ వాలంటీర్లు ఈ విషయంలో కీలక పాత్ర పోషిస్తారు అని అన్నారు. ఇప్పటికే మై భారత్ పోర్టల్ లో రిజిస్టర్ కాబడిన మై భారత్ వాలంటీర్లు మరియు దేశానికి సేవ చేయాలనుకునే ఆసక్తి ఉన్న యువత  మై భారత్ పోర్టల్లో www.mybharat.gov.in ఇవ్వబడిన సరళమైన రిజిస్టర్ ప్రక్రియ ద్వారా సమాజం పట్ల తమ బాధ్యత పెంపొందించూకోవటమే కాకుండా, క్లిష్టమైన పరిస్థితుల్లో వేగంగా ప్రతి స్పందించడానికి మరియు ప్రాణాలను రక్షించే నైపుణ్యాలు కలిగిన శిక్షణలో భాగం కావాలని కోరారు.మరిన్ని వివరాలకు నెహ్రు యువ కేంద్ర గుంటూరు కార్యాలయాన్ని సంప్రదించాలని  ఆమె కోరారు.

Share this