ప్రజాపవర్ నంద్యాల : మున్సిపల్ అత్యవసర సమావేశం ను తెలుగుదేశం కౌన్సిలర్లు బాయ్ కాట్ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 19వ తేదీన నంద్యాల లో మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు నంద్యాల కు వస్తున్న సందర్భంలో మున్సిపల్ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఒక కోటి 42 లక్షల 40 వేల రూపాయలు నిధులు సాధారణ నిధులనుండి కేటాయింపు విషయంలో 90 లక్షల రూపాయల వరకు ఖర్చుకు కౌన్సిల్ ఆమోదం తెలుపుతున్నట్లు చైర్మన్ ప్రకటించడంతో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం మున్సిపల్ కౌన్సిల్ కు సిగ్గుచేటు అని సాధారణ కౌన్సిల్ సమావేశం లో తీసుకున్న నిర్ణయాలు తీసుకోవడం సబబు కాదని తెలుగుదేశం కౌన్సిలర్లు ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించారు. తెలుగుదేశం కౌన్సిలర్లు సభ నుండి నిష్క్రమించిన తర్వాత కౌన్సిల్ సమావేశం యధావిధిగా కొనసాగింది.
మున్సిపల్ అత్యవసర సమావేశం ను బాయ్ కాట్ చేసిన టి డి పి కౌన్సిలర్లు

Leave a Reply