ప్రజాపవర్ డోన్ : స్థానిక పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకట సుబ్బారెడ్డి అధ్యక్షతన సోషియల్ స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న తూర్పు సంజీవరెడ్డి పదవీవిరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన యూటీఎఫ్ రాష్ట్ర పూర్వ గౌరవాధ్యక్షులు నరసింహుడు, నెహ్రూ నగర్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు సురేష్ బాబు, పూర్వ ప్రధానోపాధ్యాయులు రామచంద్రుడు, రామక్రిష్ణారెడ్డి, య మాట్లాడుతూ, సంజీవరెడ్డి 28 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉండి,మంచి సౌమ్యునిగా, మృధు స్వభావిగా, ఎక్కడ పనిచేసినా, ఆనందంగా పనిచేశారు. 1997 లో SGT గా ఉద్యోగం లో చేరి, దొర పల్లె, మల్లెంపల్లె, ఓబుళాపురం, గుమ్మకొండ గ్రామాల్లో పనిచేశారు.2019లో స్కూల్ అసిస్టెంట్ సోషియల్ పదోన్నతి పొంది, డోన్ పాతపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత 6 సంవత్సరాలుగా పనిచేస్తూ 31.3.2025 న పదవీ విరమణ చేశారు.ఆ తరువాత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు కలిసి సంజీవరెడ్డి దంపతులకు సన్మానం చేశారు. బంగారు ఉంగరం ఇచ్చి, శాలువా కప్పి పూలమాల సమర్పించి సన్మానించారు. వారితో పాటు గతంలో పనిచేసిన ఉపాధ్యాయులు,డోన్ మండలం ఎస్టీయు, యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘాలు, బంధుమిత్రులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సుబ్బారెడ్డి, వెంకట రమణ, బాబు,వెంకట లక్ష్మీ, శ్రీనివాసులు, జయసుబ్బరాయుడు, సుబ్బారాయుడు, సుభాన్ శివన్న, శ్రీనివాసులు, దేవేంద్రప్ప,రాధ, అల్లిపిర, రఘునాథ్, సురేష్, ఎస్తేరమ్మ,లక్ష్మీకాంతరెడ్డి, మద్దిలేటి, విజయకుమార్ , ఆదినారాయణ,శ్రీనివాసులు, రమేష్ , భాను ప్రకాష్ రెడ్డి, భారతి,లక్ష్మీ ప్రభావతి, హుస్సేన్ భాను, ముని రాజు, ప్రసాద్,శర్మ,తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల ఉన్నతిని కోరి తీర్చిదిద్దే వ్వక్తి ఉపాధ్యాయుడే

Leave a Reply