ప్రజాపవర్ గడివేముల : మండలకేంద్రంలోని మూల పెద్దమ్మ అమ్మవారికి ఉగాది జాతర సందర్భంగా అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించినట్లు ఆలయ అధికారి రామలింగారెడ్డి తెలిపారు. ఉగాది జాతర సందర్భంగా తాత్కాలిక హుండీ ద్వారా 1,94,094 రూపాయలు వచ్చాయన్నారు . శాశ్వత హుండీ ద్వారా 4,53,448 రూపాయలు వచ్చాయన్నారు. టికెట్ల ద్వారా 56,170 చందాల రూపంలో 53,800 రూపాయలు వచ్చాయన్నారు. బంగారం ఒక గ్రాము 630 మిల్లీగ్రాములు, వెండి 11 గ్రాముల 390 మిల్లి గ్రాములు కానుకల రూపంలో వచ్చాయన్నారు. హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఫెస్టివల్ స్పెషల్ ఆఫీసర్ తిరుమలరెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ దేశం రమణారెడ్డి, టిడిపి నాయకులు దేశం నరేంద్రారెడ్డి, ఎండోమెంట్ అధికారులు నాగప్రసాద్, అభిమన్యు, ఆలయ సిబ్బంది రామసుబ్బయ్య, ఉత్సవ కమిటీ సభ్యులు, తిరుమల బాలాజీ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.
మూల పెద్దమ్మ ఆలయ హుండీ లెక్కింపు

Leave a Reply