విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభను వెలిక్కి తీయడం కోసమే స్పోర్ట్స్ ఫెస్ట్ : మేనేజింగ్ డైరెక్టర్ పేర్ల సుధీర్ కుమార్ రెడ్డి

ప్రజాపవర్  రాచర్ల : విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభను వెలిక్కి తీయడం కోసమే స్పోర్ట్స్ ఫెస్ట్ కార్యక్రమం చేపట్టినట్లు స్పందన విద్యా సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ పేర్ల సుధీర్ కుమార్ రెడ్డి అన్నారు.మండల కేంద్రమైన రాచర్ల స్పందన విద్యాసంస్థలో మార్చి 26 న గిద్దలూరు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకోటయ్య చేతుల మీదుగా ప్రారంభమైన స్పోర్ట్స్ ఫెస్ట్ బుధవారం చిన్నారుల ఆనందోత్సాహాల మధ్య ఘనంగా ముగించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారి ఏ.శివకోటేశ్వరావు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా విచ్చేసిన మండల విద్యాశాఖ అధికారి ఏ.శివకోటేశ్వరరావు మాట్లాడుతూ స్పందన విద్యాసంస్థలలో వారం రోజులుగా జరుగుతున్న స్పోర్ట్స్ ఫెస్ట్ కార్యక్రమాలు పిల్లలో అంతర్లీనంగా దాగిఉన్న ప్రతిభను వెలికితీశాయని తెలిపారు.ఆద్యంతం ఉత్సాహంగా సాగిన ఈ ఆటల పోటీలలో గెలుపొందిన క్రీడాకారులను అభినందించారు.స్పోర్ట్స్ ఫెస్ట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పాఠశాల యాజమాన్యాన్ని కొనియాడారు.పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ పేర్ల సుధీర్ కుమర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు జీవితంలో ఎదురయ్యే గెలుపోటములను సమానంగా స్వీకరించుటకు ఎంతగానో ఉపయోగపడే క్రీడాపోటీలు స్పందన విద్యాసంస్థలలో నిర్వహించడం గర్వకారణమని చెప్పారు.వారం రోజులపాటు క్రీడా స్పూర్తితో ఆటల పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకున్న విద్యార్థినీ విద్యార్థులందరినీ ప్రశంసించారు.పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్పోర్ట్స్ ఫెస్ట్ నిర్వహించిన ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.స్పోర్ట్స్ ఫెస్ట్ లో భాగంగా సబ్-జూనియర్,జూనియర్ మరియు సీనియర్ కేటగిరీలలో వివిధ పోటీలలో ప్రథమ,ద్వితీయ,తృతీయ స్థానాలు సాధించిన 459 మంది క్రీడాకారులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డయాస్ మీద మెడల్స్ మరియు షీల్డులు అందించారు.అత్యధిక ప్రైజులు పొందిన నలుగురు విద్యార్థులకు చాంపియన్ అవార్డు ఇచ్చి సత్కరించారు.ఈ కార్యక్రమంలో స్పందన విద్యాసంస్థల ప్రిన్సిపల్ పేర్ల సుస్మిత రెడ్డి,విద్యార్థినీ విద్యార్థులు,ఉపాద్యాయినీ ఉపాద్యాయులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Share this