భారత క్రీడా కేంద్రానికి  ఎంపికైన నంద్యాల టైక్వాండో క్రీడాకారులు

*ఎంపికైన పవన్ తేజ, జంషీద్ హుస్సేన్

*అభినందించిన డాక్టర్ రవి కృష్ణ

ప్రజాపవర్ నంద్యాల : భారత క్రీడల శాఖ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా) నంద్యాల నుంచి ఇద్దరు క్రీడాకారులు ఎంపికైనట్లు డాక్టర్ రవి కృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ నంద్యాల క్రీడాకారులు కేంద్ర క్రీడా పాఠశాలకు ఎంపిక కావడం గర్వకారణం అన్నారు.క్రీడాకారులు క్రమశిక్షణతో క్రీడా పాఠశాలలో నిరంతర సాధన ద్వారా కృషి చేస్తే జాతీయస్థాయి, అంతర్జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచే అవకాశం ఉంటుందన్నారు.కర్నూల్ లో ఉన్న టైక్వాండో కేంద్రానికి ఫిబ్రవరిలో జరిగిన ఎంపిక పోటీలలో నంద్యాలకు చెందిన పవన్ తేజ, జంషీద్ హుస్సేన్ తైక్వాండో క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ  ప్రత్యేక కేంద్ర ప్రభుత్వ క్రీడా హాస్టల్లో సాధారణ చదువు కొనసాగేలా చూస్తూ, తైక్వాండలో జాతీయ స్థాయి కోచ్ తో శిక్షణ ఇప్పించడం జరుగుతుంది. ఉచితంగా వసతి, భోజన ఏర్పాట్లతో పాటు క్రీడా పోటీలలో పాల్గొనడానికి తీసుకువెళ్లడం, అవసరమైన క్రీడా పరికరాలు సమకూర్చడం కేంద్రమే చేస్తుంది.ఈ ఇద్దరు క్రీడాకారులు తైక్వాండో మాస్టర్లు సుందర్ రాజు, మహబూబ్ భాష, ఉదయ్ కిరణ్ శిక్షణలో తర్ఫీదు పొందారు.ఈ సందర్భంగా నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నంద్యాల క్రీడా సమాఖ్య కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు,కర్నూలు జిల్లా మాజీ ఒలింపిక్ సంఘం చైర్మన్ డాక్టర్.రవి కృష్ణ ముఖ్యఅతిథిగా పాల్గొని క్రీడాకారులకు జ్ఞాపికలు  అందించి అభినందించారు. కోచ్ లను శాలువతో సత్కరించి అభినందించారు.

ఈ కార్యక్రమంలో నంద్యాల లయన్స్ క్లబ్ కార్యదర్శి శిరిగిరి రమేష్, నంద్యాల జిల్లా పారా ఒలింపిక్ సంఘం కార్యదర్శి ఎంపి వి రమణయ్య, వెలుగోడు మాజీ జెడ్పిటిసి చింతమాని లాలిస్వామి, కోచ్ లు మహబూబ్ బాషా, ఉదయ్ కిరణ్, లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు చంద్రమోహన్,ఇమ్మడి రామకృష్ణుడు, లెక్చరర్ సురేష్, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు సుంకయ్య తదితరులు పాల్గొన్నారు.

Share this