జగన్మాత కు ప్రత్యేక పుష్పార్చన

ప్రజాపవర్ విజయవాడ  : వసంత నవరాత్రుల్లో ఆరవ శుక్రవారం శ్రీ కనక దుర్గ అమ్మవారికి ప్రత్యేక పుష్పార్చన వైభవంగా జరిగింది.కాగడా మల్లెలు, జాజులు, మరువములతో నూతనంగా నిర్మించిన పూజా మండపం ( నటరాజ స్వామి ఆలయ ప్రాంగణం)లో ఉదయం 9 గంటల నుండి పుష్పార్చన వైభవంగా ప్రారంభం అయింది.శ్రీ కనకదుర్గ అమ్మవారి ప్రధాన ఆలయం నుండి పుష్పాలతో మంగళ వాయిధ్యాలు, వేద మంత్రాలు నడుమ ఆలయ అర్చకులు, సిబ్బంది అర్చన ప్రాంగణంకి వెదురు బుట్టలతో పుష్పాలు తీసుకొని విచ్చేసిన అనంతరం ప్రత్యేక పూజలు ప్రారంభం అయ్యాయి.
ఈ పుష్పార్చన కార్యక్రమంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

Share this