ఫిజియోథెరపీ వైద్యం తో పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పికి వీడ్కోలు చెప్పండి : డాక్టర్ రోహిణివిజయ్

డాక్టర్ రోహిణివిజయ్
* గర్భాశయం సంకోచాల వల్ల సంభవించే తిమ్మిరి నొప్పి కాలం క్రాంప్ లకు ఫిజియోథెరపీ చికిత్స
నంద్యాల : ఫిజియోథెరపీ వైద్యం తో పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పికి వీడ్కోలు చెప్పండనీ డాక్టర్ రోహిణివిజయ్ తెలిపారు. ఈ సదర్భంగా ఆమె మాట్లాడుతూ సాదారణంగా ఋతు చక్రం కాలవ్యవది 28 రోజులు మరియు రక్తస్రావం 3 నుండి 8 రోజులు వుంటుంది.  ఈ సమయంలో దాదాపు 30 ఎం.ఎల్  రక్తస్రావం అవుతుందని, నెలవారి ఋతు చక్రం సమయంలో స్త్రీలలో వివిధ అసౌకర్యలక్షణాలు వుంటాయని బహిష్టుకు ముందు కాళ్ళు చేతులు తిమ్మర్లు అలసట కడుపునొప్పి వంటి లక్షణాలు ఉంటాయి. సాదారణంగా గర్భాశయం సంకోచాల వల్ల సంభవించే తిమ్మిరి నొప్పి కాలం క్రాంప్ లకు ఫిజియోథెరపీ చికిత్స అందుబాటులో వుంది. ఈ సమయంలో మహిళలకు ఫిజియోథెరపీ వైద్యంలో నొప్పిని తగ్గించడానికి హీట్ మరియు శీతల థెరపీ విదానం TENS ఉపకరిస్తుంది. ఫిజియోథెరపిస్ట్ లు ఆడవారి అవసరాలకు అనుగుణంగా వ్యాయమాన్ని సూచిస్తారు. పీరియడ్స్ సమయంలోని తిమ్మిర్లు నొప్పులు, నడుమునొప్పి, ఉదర మరియు శ్వాస వ్యాయామాలు స్ట్రెచింగ్ ఫిజియో బాల్ ఎక్సర్సైజ్ పిల్లోపోజిషన్ కప్పిoగ్ మొదలైన పద్ధతులు ఉపయోగిస్తారని, ఈ సమయంలో వ్యక్తిగత శుభ్రత మరియు ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు మంచి నిద్రకూడా ప్రదానపాత్ర పోసిస్తుందని ఐఏపీ నంద్యాల జిల్లా కన్వీనర్ డాక్టర్ రోహిణివిజయ్ సూచించారు.

Share this