ప్రజాపవర్ నంద్యాల : వ్యవసాయ శాఖ కమిషనర్ వారి ఆదేశాల మేరకు జిల్లా వ్యవసాయ అధికారి, వై.వి.మురళి కృష్ణ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ కమిషనర్ వారి కార్యాలయము నుండి సహాయ వ్యవసాయసంచాలకులు బి.ఏస్.శ్రీనివాసాచార్యులు , వ్యవసాయ అధికారి జే.శివ రామకృష్ణ , సహాయ వ్యవసాయ సంచాలకులు నంద్యాల, దార రాజశేఖర్ మరియు మండల వ్యవసాయ అధికారి ఇ.ప్రసాద రావు కలిసి మండలములో గల ప్రత్తి విత్తన శుద్ది కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ కార్యక్రమములో బాగంగా శ్రావణ లక్ష్మి సీడ్స్, వినాయక అగ్రో ఇండస్ట్రీస్, హారినాథ్ క్రాప్ జనిసిస్, భవ్య సీడ్స్, బబ్బూరి ఆగ్రో ఇండస్ట్రీస్, శ్రీ వెంకటేశ్వర సీడ్స్, శ్రీ శ్రీ భారతీ సీడ్స్, న్యూ వెంకటేశ్వర సీడ్స్ విత్తన శుద్ది కేంద్రాలలో తనిఖీలు నిర్వహించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ కేవలము వ్యవసాయ శాఖ ద్వారా అనుమతి పొందిన కంపెనీల విత్తనాలు మాత్రమే ప్రాసెసింగ్ చేయాలని, అలాగే విత్తన శుద్ది చేసే ప్రతి ఒక్కరూ కాలుష్య నియంత్రణా మండలి నుండి అనుమతులు పొంది వుండాలని తెలియజేశారు. కార్యక్రమము లో బాగంగా శ్రావణ లక్ష్మి సీడ్స్ విత్తన శుద్ది కేంద్రం లో 11 లాట్ లలో, హరినాథ్ క్రాప్ జనిసిస్ లో-06, భవ్య సీడ్స్ విత్తన శుద్ది కేంద్రంలో 8 , బబ్బూరి ఆగ్రో ఇండస్ట్రీస్ లో-08 , శ్రీ వెంకటేశ్వర సీడ్స్ లో 12, శ్రీ శ్రీ భారతీ సీడ్స్ నందు 14 లాట్లలో HT కాటన్ (హెర్బిసైడ్ టోలరెంట్) స్ట్రిప్ టెస్ట్ నిర్వహించారు. ఇందులో HT నెగెటివ్ వచ్చింది. ప్రతి ఒక్క విత్తన శుద్ధి కేంద్రం యొక్క యజమాని విత్తన శద్ధి కేంద్రానికి సంబంధించిన అన్ని రిజిస్టర్లు నిర్వహించాలని తెలియచేసారు. తదుపరి విత్తన రిటైల్ దుఖానాల నందు తనిఖీలు నిర్వహించి రికార్డులు పరిశీలించి ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే వారిపై విత్తన చట్టము 1966 మరియు విత్తన నియంత్రణ క్రమము 1983 ప్రకారము చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రత్తి విత్తన శుద్ది కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన వ్యవసాయాధికారులు

Leave a Reply