భుజం నొప్పి ఫిజియోథెరపీ వైద్యంతో ఉపశమనం:ఫిజియోథెరపీ డాక్టర్ జగదీశ్వర రెడ్డి

ప్రజాపవర్  నంద్యాల : అతి భయంకరమైన చక్కెర వ్యాధి ప్రస్తుత ప్రపంచాన్ని భయ పెడుతున్నది. డయాబెటిక్ వ్యాధి  శరీరంలోని అతిముఖ్యమైన గుండె కిడ్నీలు భుజాలు తదితర అవయవల పై తీవ్ర ప్రభావం చూపుతుంది. మధుమేహ వ్యాధి వల్ల ప్రతిదినం నొప్పితో బాధపడుతున్నవారికి ఫిజియోథెరపీ చికిత్సతో ఉపసమనం కలుగుతుందని ఫిజియోథెరపీ డాక్టర్ జగదీశ్వర రెడ్డి అన్నారు.

షుగర్  వ్యాధి  భారిన పడినవారు నిత్యావసర పనులు కూడా చేసుకోలేక పోతున్నారని దీనివల్ల మానసిక ఓత్తిడికి గురవుతున్నారన్నారు. దీనికీ పరిస్కార మార్గం ఫిజియోథెరపీ లో మాత్రమే వుందని అంతేకాక భుజం నోప్పితో పాటు భుజం కదలికలు కష్టంగా మారి చేతిని ఎత్తలేక పోవటం, వస్తువులు పట్టుకోలేకపోవటం జరుగుతుందని, దీనికీ పరిస్కార మార్గం ఫిజియోథెరపీ వైద్యంలోని అల్ట్రాసాండ్ థెరపీ, లేజర్‌ థెరపీ క్రయో థెరపీ డ్రై నీడ్లింగ్ తోపాటు ప్రత్యేకమైన ఎక్సర్‌సైజ్ ల ద్వారా తగ్గించ వచ్చని ఐ ఏ పీ నంద్యాల జిల్లా కోశాధికారి డాక్టర్ అన్నపురెడ్డి జగదీశ్వర రెడ్డి తెలిపారు.

Share this