ప్రజాపవర్ రావులపాలెం : పిల్లల్ని బడికి పంపి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వెయ్యాలి సీనియర్ రాజకీయ నేత తెలుగు రైతు రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఆకుల రామకృష్ణ అన్నారు. మండలంపరిధిలోని గోపాలపురం గ్రామంలో మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల స్కూల్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన మన బడికి పోదాం కార్యక్రమంలో ముఖ్య అతిధిగా తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆకుల మాట్లాడుతూ గ్రామాలల్లో బడి ఈడు పిల్లలను ప్రభుత్వపాఠశాలల్లో చేర్పించి మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాది బాటలు వేయాలని పిల్లల తల్లీ తండ్రులను ఆయన కోరారు. గురువువైలైనటువంటి ఉపాధ్యాయలు అందిస్తున్న విద్యాబోధన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యా మిత్ర డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనాలతో ఏవిధమైన ఫీజులు లేని మన బడికి పోదాం ఉన్నతమైన స్థాయిలో నిలబడదాం స్కూల్లో విద్యార్థులకు పరిశుభ్రతమైన త్రాగునీరు రోజు ఆటల సాంస్కృతిక కార్యక్రమాల ప్రభుత్వబడి కన్నతల్లిఒడి నిర్వహణతో ప్రతీ విద్యార్థికి తల్లీకి వందనంతో మూడు జతల యూనిఫామ్ ప్రభుత్వాలు చేయూత నిస్తున్నాయని రామకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు. ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు
పిల్లలను బడికి పంపి బంగారు భవిష్యత్తుకు బాటలు వెయ్యాలి : తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకులరామకృష్ణ

Leave a Reply