* కస్టమ్స్ కమిషనర్ సాధు నరసింహారెడ్డి
* కేంద్రీయ విద్యాలయం కు కంప్యూటర్ల అందజేత
ప్రజాపవర్ గుంటూరు : పాఠశాల విద్యా కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు కస్టమ్స్ కమిషనర్ సాధు నరసింహారెడ్డి ఐదు కంప్యూటర్ల ను విరాళంగా అందచేసారు. బుధవారం మధురానగర్ లోని కేంద్రీయ విద్యాలయాన్ని కస్టమ్స్ కమిషనర్ నరసింహారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ విద్యార్థుల విద్యాభివృద్ధిని మెరుగుపరచటానికి, పాఠశాల శిక్షణా వేదికను బలోపేతం చేయడానికి స్వచ్చా భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నూతన కంప్యూటర్లను విద్యాలయంకు డొనేట్ చేసామని తెలిపారు. ఇది విద్యార్థుల ప్రతిభ ను మెరుగు పరచడంతో పాటు పాఠశాల అభివృద్ది లో నాణ్యమైన ప్రభావం చూపే అవకాశం వుందన్నారు.
అనంతరం కమిషనర్ విద్యార్థులతో మాట్లాడి, వారి భవిష్యత్ లక్ష్యాలను తెలుసుకున్నారు. విద్యార్థులు తమ ఆశయాలు, లక్ష్యాలను కమిషనర్ తో పంచుకొన్నారు. ఈ సందర్భంగా కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందం కమిషనర్ అందిస్తున్న నిరంతర సాయానికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యను ప్రోత్సహించే దిశగా కమిషనర్ నరసింహారెడ్డి తమ నిబద్ధతను చాటారని కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపాల్ ఆదిశేష శర్మ కొనియాడారు.
కార్యక్రమంలో కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్ మిట్టపల్లి శ్రీనివాస్, అజీమ్ సూపరింటెండెంట్లు వేణు గోపాల్, సాధిక్ ఆలీ, కాకర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply